వృద్ధాప్యంలో స్వేచ్ఛనివ్వాలి.*  నిందలు, నిర్బంధాలు కూడదు

Oct 1, 2026 - 08:27
 0  0

తమదాక వస్తే కానీ తెలియదు. ఆస్పృహ, సోయి ఉంటే  జగమంత కుటుంబం నాది అని  గంతులె య్యవచ్చు .
ఆ వ్యవస్థ కోసం అందరం ఆరాటపడదాం.

---- వడ్డేపల్లి మల్లేశం 

"మానవుడు సంఘజీవి" అని  ఆచరణాత్మకంగా గత శతాబ్దాలుగా  రుజువైనప్పటికీ దానికి భిన్నంగా నడుచుకోవడం మనుషులను కాకుండా డబ్బును ప్రేమిస్తూ మనిషి ఒంటరి ఔతున్న నేఫథ్యంలో   అరిస్టాటిల్ హెచ్చరిక  సమాజంలో   మనుషులు  పరస్పర అవగాహనతో జీవించాలని  చేసిన మెరుగైన సూచనగా భావించవచ్చు.  తోటి మనిషిని సాటి మనిషిగా భావించాలని  మానవీయ కోణంలో  పరస్పర బంధాలను గౌరవించుకోవాలని అరిస్టాటిల్  సూచిస్తే  కుటుంబంలోనే  పలు కారణాల రీత్యా పగుళ్లు రావడం ఆందోళన కలిగించే విషయం. అలాంటప్పుడు విశ్వ కుటుంబ భావన ఎలా సాధ్యమవుతుంది ?ప్రతివాడు కూడా ఒంటరి వాడిని అని కాకుండా  జగమంతా నా కుటుంబం అని సగౌ రవంగా చెప్పుకునే పరిస్థితులు రావాలంటే  విశాల అవగాహనతో సామాజిక  స్పృహతో  తోటి మనిషిని సాటి మనిషిగా గౌరవించే ఆలోచనను పుణికి పు చ్చుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.  ఈ భావనకు అంతరాయం కలిగిస్తున్నటువంటి సమాజంలోని భిన్నమైన సంస్కృతులు,  ఆర్థిక   అరాచకత్వం, స్వార్థము,  స్వప్రయోజనాలను, భిన్న రుగ్మతలను దెబ్బతీయాల్సినటువంటి అవసరం ఉంది. మార్క్స్ ప్రకారంగా మానవ సంబంధాలు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అని ఏనాడో  హెచ్చరిస్తే అలాగే ఇప్పటికీ కొనసాగితే  మన సంస్కృతికి  నాగరికతకు అర్థం ఏముంటుంది?  శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులను సాధించుకొని  సాహిత్య సంస్కృతిక రంగాలలో  ఎంతో ఎదుగుదలను సంతరించుకొని  మనిషి పుట్టుక నుండి చావు వరకు  నిర్వహించే పాత్రలపైన  పట్టు సాధించినప్పటికీ  మనిషి పరస్పర గౌరవానికి మాత్రం అంగీకరించడం లేదు. "తన ఆధిపత్యం ధిక్కారస్వరంతో  ఇతరులను అవమానించడం, వంచనకు గురి చేయడం, లొంగదీసుకోవడం,  అసలు మనిషిగానే లెక్కించకపోవడం వంటి దుర్మార్గపు  అలవాట్లతో ప్రతి కుటుంబం  ఏదో రకంగా చిద్ర మవు తూనే ఉంది.  కుటుంబ బంధాలు బలంగా ఉంటే మానవ సంబంధాలు  విశ్వ కుటుంబ భావన సాధ్యమవుతుంది కదా!  స్వేచ్ఛ, సమానత్వము,  పరస్పర గౌరవము, మానవీయ దృక్పథo,  విస్తృత అవగాహన, విశాల భావనను పెంపొందించ వలసిన విద్యా వ్యవస్థ  ఆ పాత్రను పోషించకపోవడం  అందుకు ఎన్నో అంతరాలు  అడ్డుపడడంతో  మానవుడు సంఘజీవి అన్న నిర్వచనం నినాదం  పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. " అందుకు మనమంతా సిగ్గుపడి, మన బాధ్యతను గుర్తించి, మన తప్పులను సవరించుకొని, పొరపాటును అంగీకరించి,  జగమంత మన కుటుంబమే అనే భావనకు పునరంకితం కావాల్సిన అవసరం చాలా ఉంది. " దుర్మార్గులు, దుండగులు, అగంతకులు,  పేదలను దోచే పెట్టుబడిదారులు,  ప్రజా వ్యతిరేక శక్తులను అణిచివేయాలంటే సమాజంలో శాంతిని స్థాపించాలంటే  ఈ విశ్వ కుటుంబ భావన చాలా దో హదపడుతుంది.  తన కుటుంబం చివరికి తన వరకే గిరి గిసుకుంటే కుటుంబంలోని ఇతర సభ్యులందరూ కూడా శత్రువులు గానే కనిపిస్తారు జాగ్రత్త!  ఇవాళ ప్రతి కుటుంబంలో జరుగుతున్నది అమలవుతున్నది అనుభవిస్తున్నది  అదే. "

నిందలు నిర్బంధాలు వద్దు స్వేచ్ఛనివ్వాలి  :-

ప్రస్తుతం ఉన్న సమాజానికి  ఉత్తమ వారసులను అందించిన మన పూర్వీకులు పెద్దలు తల్లిదండ్రులు  వృద్ధులు  బ్రతికి ఉన్నవారితో సహా చనిపోయిన వారిని కూడా స్మరించుకోవడం  గౌరవించడం  ముందుగా మన సంస్కృతిలో భాగం కావాలి. కానీ  బ్రతికి ఉన్న వారితో సహా చనిపోయిన వారిని కూడా  నిందిస్తూ కాలయాపన చేస్తూ  పదిమందిలో దుష్ట ప్రచారం చేస్తూ  తమ ఆధిపత్యాన్ని  ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్న నేటి తరం  వాళ్ల వారసులమని కూడా మరిచిపోయి  స్వార్థాన్ని పెంచుకొని  అంతా తామే సంపాదించిన ఆస్తులని  తల్లిదండ్రులు వృద్ధులు మనకు ఏమి ఇవ్వలేదని గర్వంగా చెప్పుకుంటూ  వికృత చేష్టలకు పాల్పడుతూ  తల్లిదండ్రులను బయటికి గెంటివేస్తున్న దుర్మార్గులు కూడా మనకు తారసపడుతున్నారు. పిల్లలు కూడా అనుకరిస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మిగతా వృద్ధులకు  కుటుంబ సభ్యులకు  ప్రధానంగా స్వేచ్ఛ చాలా అవసరం.  వయసు పైబడిన కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గుతూ గుర్తించే శక్తి  కోల్పోయి  మూగజీవులుగా మారే ప్రమాదం ఉంటుందని ఒకవైపు శాస్త్రం హెచ్చరిస్తున్నది. శరీరంలోని ఏ అవయవరాలనైనా  కదిలించకుంటే  వాటికి పని కల్పించకుంటే  కదలిక లేని  స్థితిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. అలాగే  వాళ్లకు స్వేచ్ఛనిచ్చి   సమ వయస్కులతో  మాట్లాడుకోవడం,పరస్పర భావాలను పంచుకోవడం,  గతాన్ని జ్ఞప్తికి చేసుకోవడం,  తమ పిల్లల గెలుపు అభివృద్ధి ప్రస్తుత స్థితిగతులను  ముచ్చటించుకోవడం ద్వారా మరింత ఉత్సాహ పరిస్థితుల్లోకి  వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.  కానీ ""మాట్లాడటానికి కూడా  స్వేచ్ఛ ఇవ్వకుండా  భావాల పైన సంకెళ్లు వేసే వాళ్లు కూడా మనలో చాలామంది ఉన్నారు. తిని పడుకోవాలి, మాట్లాడకూడదు, ఈ వయసులో అవసరమా? మీరు సాధించిన గొప్పలు చెప్పుకోవడానికేనా? అని మందలించి నిందించి అవమానించే  కొడుకులు కోడళ్లు మిగతా కుటుంబ సభ్యులు  లక్షల సంఖ్యలో ఉన్నారు.  ఎంత సంపాదించిన వారైనా ఎంత  ఉన్నత స్థితిని సాధించిన వాళ్ళైనా వృద్ధులు కావాల్సిందే.  మట్టిలో కలవాల్సిందే. ఈ కనీస వాస్తవాన్ని గుర్తించకుండా  కొడుకులు కోడళ్లు ఇతరులు కూడా ఆడిపోసుకోవడం  అవమానించడం  పిడికెడు మెతుకులకు దూరం చేయడం  కనీసం మనుషులుగా చూడకపోవడం అంటే మనం నాగరిక ప్రపంచంలో ఉన్న అనాగరికు లం కాక మరేమిటి?".
       తమాదాకా వస్తే కానీ తెలియదు:-
************
  ఇది ఒక కుటుంబానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. సర్వత్రా వినబడుతున్న ప్రతిరోజు పత్రికల్లో కనపడుతున్న అధికారులకు ఆర్డిఓ లకు న్యాయస్థానానికి పోలీస్ స్టేషన్ కు  వెళుతున్న వాస్తవం. వృద్ధులు నడిచీ నడవలేక  చేతగాక  ముక్కాలు సహాయముతో మూలుగుతూ  ఫిర్యాదు చేస్తున్నారు, దరఖాస్తులు ఇస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు.  చట్టపరంగా  కేంద్ర ప్రభుత్వం, పలు రాస్ట్రాల  ఉత్తరుల మేరకు  పోలీస్ స్టేషన్లో కొంతవరకు ఆర్డిఓ ఇతర అధికారుల స్థాయిలో కూడా వృద్ధుల సమస్యలను పరిష్కరించే కృషి జరుగుతున్న మాట వాస్తవం. 
  తమ పిల్లలపై మమకారం,  తమ వాళ్లను బజారుకు ఈడ్చవద్దనే పెద్దరికం,  పట్టించుకుంటారో లేదో అనే సందేహం,  తోడుగా సహకరించే వాళ్ళు లేని అసమర్థత కారణంగా  తమకు అన్యాయం జరిగినా, అవమానాల పాలైన మూలుగుతూ జీవిస్తున్నారు కానీ  ఫిర్యాదు చేయడానికి మనసొప్పని వాళ్లు కూడా లక్షల్లో ఉన్నారు .ఈ సమస్య కేవలం ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనది కాదు  భారతదేశానికి పరిమితమై మాట్లాడితే  ప్రతి ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఈ వివక్షత అణచివేత అవమానాలు కొనసాగుతూనే ఉన్నాయి.  ""ఈనాడు వయసు మీద ఉండి నిందిస్తున్న వాళ్లు రేపు వృద్దులు కారా?  శరీరంలో ముడతలు రావా?  జవసత్వాలు ఉడిగి ఇంతకు మించిన అవమానమాకరమైన పరిస్థితులను ఎదుర్కొంటే అప్పుడు ఏమంటారు?  క్రమక్రమంగా  జనాలు ప్రేమకు దూరమై  డబ్బుకు చేరువవుతున్న సందర్భంలో  తల్లిదండ్రులను చూసుకోవడానికి  ఆరాటపడే వాళ్ళ సంఖ్య మరీ తగ్గుతూ  ముఖ్యంగా నేటి యువత  సామాజిక రుగ్మతలకు ఒంటరితనానికి అలవాటు పడుతున్న నేపథ్యంలో  నేడు అవమానిస్తున్న ఈ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆ కొడుకులు కోడళ్లు చూసుకుంటారా?  వాళ్లు ఇంతకుమించినటువంటి అహంకారంతో ఆధిపత్యంతో  కుటుంబానికి దూరమై దూరంగా జీవిస్తే? మీరు చూడనిది మేమెందుకు చూడాలని ప్రశ్నిస్తే?  ఈనాటి  వృద్ధులకు ఎదురైన పరిస్థితులు రేపు వాళ్లకు  అటస్థ పడితే?  ఆరోగ్యం పూర్తిగా క్షీణించి  అడుగు వేయలేని పరిస్థితులలో
దుఃఖించి ఏడ్చి  హా హాకారాలు పెడితే ప్రయోజనం ఏముంటుంది?  అప్పుడు కానీ తెలియదు  తమ వల్ల  హింసించబడినటువంటి వృద్ధులు పెద్దల అనుభవాలు  అందుకే తమ దాకా వస్తే కానీ తెలియదు అనే సామెతను నిరంతరం జ్ఞప్తికి తెచ్చుకొని  వృద్ధాప్య దశ ప్రతి వ్యక్తికి తప్పనిసరి అని  కుటుంబానికి రెండు వైపులా ఒకటే పరిస్థితులు ఉంటాయని  ఒకే  వైపు ప్రేమానురాగాలను చూపించడం మరొకవైపు  వివక్షత చూపించడం లాంటి దుష్ట సంస్కృతిని  సమాధి చేయాల్సిన అవసరం ఉంది"".  తన తల్లిదండ్రులు బాగా జీవించాలని వారిని బాగా చూసుకోవాలని వారికి ఎలాంటి కష్టాలు రాకూడదని ఒక స్త్రీ ఆవేదన పడుతుంది అందులో ఎంతో వాస్తవం ఉంది.  అదే మాదిరిగానే  తన అత్తవారింట్లో ఉన్న వృద్ధులు అత్తమామలు ఇతరులు  బాగుండాలని కోరుకోకపోవడంలో  ఎంత వివక్షత ఉందో అర్థం చేసుకోవాలి.

కొంత లోతుగా ఆలోచిస్తే!!!

  అదే సందర్భంలో కడుపున పుట్టిన కొడుకులు కూడా  నిర్బంధంగా నెట్టివేయడం కాటికి పంపిన అనుభవాలను గమనిస్తే  ముఖ్యంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్యన  సమన్వయం లోపించడం, నిత్యకయ్యం  వృద్ధులకు శాపంగా మారినట్లు గుర్తించవలసి ఉంటుంది. అదే సందర్భంలో  నీ తల్లిదండ్రులు నా తల్లితండ్రులు అందరూ సమానమే అనే భావన భార్యాభర్తలు కనుక  గుర్తించి అంగీకరించి  మానవీయ కోణంలో ఆలోచించగలిగే  పరిస్థితులు ప్రతి కుటుంబంలో రావడానికి  చట్టాల యొక్క పదును మాత్రమే సరిపోదు.  నేటి విద్యా విధానం,  సాంస్కృతిక శాఖ  కార్యకలాపాలు, కుటుంబ బంధాలకు సంబంధించినటువంటి  స్వచ్ఛంద సంస్థలు, చట్టబద్ద ప్రభుత్వ కమిటీల ద్వారా కార్యక్రమాలు  సమాంతరంగా కొనసాగించడం ద్వారా  బంధాల బలోపేతానికి, వృద్ధుల వివక్షత  ఇబ్బందులను  అరికట్టడానికి  సాధ్యమవుతుంది.  ఆ వైపుగా ప్రభుత్వం కూడా  వృద్ధుల సంరక్షణ శ్రేయస్సు  తన సామాజిక బాధ్యతగా గుర్తిస్తే  వృద్ధులకు కొంతైనా న్యాయం జరుగుతుంది.  మనుషులు మాత్రమే గాక  మనసులు మరీ మరీ మారాలి.  మానవీయ కోణంలో ఆలోచించి  తనదాకా వస్తే ఎలా? అని  దిగులు పడితే  తప్పక తప్పు తెలుసుకుంటారు  తప్పులు చేయకుండా ఉంటారు .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333