రహదారి భద్రతను ఛిద్రం (చిత్రo) చేస్తున్న మద్యం, మత్తు పదార్థాలు .
బాధ్యత తెలిసి త ప్పటడుగులే స్తున్న ప్రభుత్వాలు -
మధ్యమే ఆదాయ వనరు అనే మత్తులో సర్కారు.
ప్రజా జీవితం విచ్ఛిన్నమౌతుంటె కటిననిర్ణయాలకు చేతులురావు ఎందుకు?
--- వడ్డేపల్లి మల్లేశం
విచ్చలవిడిగా జరుగుతున్న ప్రమాదాలతో రహదారులకు భద్రత లేదు ప్రయాణికులకు అంతకు లేదు రక్తసిక్తమవుతున్న రోడ్లు వేల కుటుంబాలు అనాధలుగా మారుతుంటే ఇప్పటికీ ప్రభుత్వం డ్రంక్ అండ్ డ్రైవ్ (శ్వాస విశ్లేషణ )పరీక్షలతో కాలయాపన చేస్తున్నదే తప్ప జరుగుతున్న ప్రమాదాలకు, పాల్గొంటున్న యువత చెడు మార్గాలని , రెచ్చిపోవడానికి కారణం అవుతున్న మత్తు మద్యం డ్రగ్స్ విచ్చలవిడి అమ్మకాలను కారణాలుగా ప్రభుత్వం అంగీకరించడం లేదు . అంటే దీనికి మధ్యము మత్తు డ్రగ్స్ ఇతరత్రా క్లబ్బులు పబ్బులు ఈవెంట్ ను ఆదాయ వనరుగా భావిస్తున్నది అని ఘంటాపథంగా చెప్పక తప్పదు . పండుగలు కొత్త సంవత్సరాలు ఇతరత్రా సందర్భాలలో ప్రభుత్వమే మరో గంట పాటు రాత్రి అదనంగా సమయం ఇవ్వడం, అనేక అఘాయిత్యాలు అనర్థాలు జరిగినప్పటికీ న్యాయవ్యవస్థ కూడా నిషేధించాలని ఉత్తర్వులు ఇవ్వకపోవడం, ఆదాయం కోసం ఎంతకైనా దిగజారే ప్రభుత్వాలకు ఊతమిచ్చినట్లు అవుతున్నది . మత్తులో కారు పై పడిన మృతదేహంతో కిలోమీటర్ల కొద్ది నడిపే వాళ్ళు ఒకరైతే, మద్యం మత్తులో రాక్షస కృత్యంతో భార్యని తన వాహనానికి కట్టుకొని కిలోమీటర్ల కొద్ది నరకయాతనకు గురి చేసిన ప్రబుద్ధులు మరి కొందరు . సంపన్న కుటుంబాలకు చెందిన వారికి కార్లకు వాహనాలకు వాటి వినియోగానికి హద్దు పద్దు లేకపోగా మద్యం మత్తుకు అలవాటు పడుతున్న 20 30 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్ళు ముఖ్యంగా అర్ధరాత్రి దాటినాక కూడా అదే మత్తులో ఊరేగి రోడ్ల పైన ప్రయాణించి ఎందరినో తిరిగిరాని లోకాలకు పంపించి థా ము బలవుతున్న వాళ్లను మనం గమనించవచ్చు. రోడ్డు దాటుతున్న చిన్నారులు, వృద్ధులు, వ్యా ది పీడితులు, మహిళలు , ఎంతోమంది మత్తు మహమ్మారిలో ఊరేగుతున్న దుర్మార్గుల కారణంగా నూరేళ్లు నిండిపోతున్నాయి. ముఖ్యంగా యువత ఎక్కువ మొత్తంలో వాహనాలను వినియోగించడం, మద్యానికి బానిస కావడం, పెద్ద మొత్తంలో తాము ప్రాణాలను కోల్పోతూ ఇతరులను కూడా వి గత జీవులుగా మార్చడo సహించరానీ నేరం .
కొన్ని గణాంకాలను పరిశీలిస్తే :-
జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం 2022 లో మద్యం లేదా డ్రగ్స్ మత్తు పదార్థాలు వాడకం తో వాహనాలు నడిపిన వారి కారణంగా సుమారు 3000 ప్రాణులు గాలిలో కలిసినట్లు 6000 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంటే అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ తో పోల్చితే తెలంగాణలో మద్యం తో వాహనాలు నడిపిన సంఘటనల్లో మరణాలు ఎక్కువ సంభవించినట్టు తెలుస్తున్నది . మద్యం విధానమే లోప భూ యిష్టం గా ఉండడం వలన క్లబ్బులు దాబాలలో విచ్చలవిడిగా ప్రభుత్వమే అనుమతించి ప్రయాణికులు వాహనాలు త్రాగడానికి అవకాశం ఇచ్చి ఆ వెంటనే డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా వెతికి పట్టుకోవడం ద్వంద్వ నీతి కాదా? కొంతమంది తప్పించుకుని పోయి ప్రమాదాలు చేయడం, పోలీసుల పైన ఒత్తిడి పెరగడం , రాజకీయ జోక్యం వంటి కారణాల వలన ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య సరిగ్గా నిర్ధారించబడడం లేదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .గత సంవత్సరం హైదరాబాదులోని పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో లక్ష మందికి పైగా మద్యం మత్తులో ఉన్న వారిపైన కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది వీరిలో 5000 మందిని జైలుకు పంపిస్తే విజయవాడ నగరంతో పాటు పరిసర జిల్లాలలో గత రెండు నెలల వ్యవధిలో వెయ్యికి పైగా కేసులలో కోటి రూపాయల జరిమానాలు విధించినట్లు తెలుస్తున్నది . కోర్టులు జరిమానాలు విధించినప్పటికీ వాహనదారులు మళ్లీమళ్లీ అదే తప్పు చేస్తున్నట్లు పోలీసుల పరిశీలనలో వెల్లడైతే ఢిల్లీలో ఒక స్వచ్ఛంద సంస్థ 30,000 మంది వాహనదారులతో ఒకసారి సర్వే చేస్తే తాగి బండ్లు నడిపినట్లు 81 శాతం మంది అంగీకరించినట్టుగా తెలుస్తున్నది . ప్రతి ప్రాంతంలోనూ గతానికి ఈ సంవత్సరానికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రెట్టింపు అవుతున్నటువంటి సందర్భాన్ని అవలోకనం చేసుకుంటే మూలాలను వెతకకుండా ఈ దుర్భర పరిస్థితులను, ప్రమాదాలను, మృత్యుఘోషను ఆపలేము అని అర్థమవుతూనే ఉంది. అయినా పాలకులకు ఎందుకు సోయి రావడం లేదో చనిపోతున్న యువత మానవ వనరులను కాపాడుకోవడానికి కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడటం లేదో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది . ప్రజలు వాహనదారులు స్వచ్ఛందంగా మద్యం మత్తు పదార్థాలకు దూరమై విరమించుకోవడంతో పాటు ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటేనే మత్తు పదార్థాల వల్ల జరుగుతున్న అనర్థాలను అడ్డుకోవచ్చు. ఆ బాధ్యతను ప్రభుత్వాలు భుజానికి ఎత్తుకుంటే, ఆదాయ వనరుగా భావిస్తున్నటువంటి మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తే మాత్రమే రహదారి భద్రంగా ఉంటుంది ప్రమాదాలు జరగకుండా ప్రశాంతంగా ప్రయాణాలు సాగిపోతాయి.
ఈ కేసులను తగ్గించాలంటే త్రాగి బండి నడిపే ప్రతి ఒక్కరికి కఠిన శిక్షలు వేయాలని లైసెన్సులు రద్దు చేయాలని అనేక సూచనలు రావడం సహజమే . జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో మద్యం విక్రయాలను నిషేదించాలని భారత సర్వోన్నత న్యాయస్థానం ఏనాడో ఆదేశించినప్పటికీ ఆదేశాలు అమలుకాలేదంటే పాలకుల బలహీనతలు అర్థంచేసుకోవచ్చు. మద్యం వినియోగం వల్ల జరుగుతున్న అనర్థాలను న్యాయవ్యవస్థ, పాలకులు, మేధావులు, మనో వైజ్ఞానికులు ఉమ్మడిగా చర్చించి దేశవ్యాప్తంగా నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడమే ఇందుకు శాశ్వత పరిష్కారం . ప్రమాదంలో లక్షల కుటుంబాలు వీధి పాలు కావడం, దేశవ్యాప్తంగా విజృంభి0 స్తున్న క్యాన్సర్లకు సుమారు 5 నుండి 10 శాతానికి ఆల్కహాల్ వినియోగమే కారణమని పరిశోధనలు వెల్లడించినప్పటికీ , నేరాలకు మధ్యమే ప్రధాన కారణమని రుజువైనప్పటికీ కూడా ఆరోగ్యాలను గుళ్ళ చేస్తున్న మధ్యము మత్తు డ్రగ్స్ వంటి వాటిని ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతించడం పరోక్షంగా ప్రోత్సహించడం నేర ప్రవృత్తికి ప్రమాద పరిస్థితులకు ప్రధాన కారణమవుతున్నాయి . అమ్మకానికి మాత్రమే పరిమితం చేసి చాలా తక్కువ సంఖ్యలో సుదూర ప్రాంతాలలో దుకాణాలను నడిపిస్తే ధాబాలు ఇతరత్రా మద్యం త్రాగడానికి గల అవకాశాలను పూర్తిగా మూసివేస్తే కొంత కట్టడి చేయవచ్చునేమో! మద్యం పాలసీ లోనే మోసం, దోపిడీ ,స్వార్థం, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం దాగి ఉన్నప్పుడు పాలకులు మాత్రం ఆ మేరకైనా పరిమితం చేస్తారని విశ్వాసం ఈ దేశ ప్రజలకు లేదు. ప్రభుత్వానికి లేని బాధ్యతను ప్రజలైన భుజానికి ఎత్తుకొని దేశాన్ని ఆరోగ్యభారతం చేయడానికి స్వచ్ఛందంగా విరమించుకుంటారని ప్రభుత్వానికి నిషేధించమని విజ్ఞప్తి చేస్తారని ఆశించడం అత్యాశ కాదు కదా !
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం) జీ