విలేఖరి పై దౌర్జన్యం
వ్యవహారం పై ఫిర్యాదు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడుతానని హామీ

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి :- చెరువు మాదారంగ్రానైట్ వ్యవహారంపై మందా కృష్ణ మాదిగ ఆరా..!
విలేకరిపై దౌర్జన్యం వ్యవహారం పై ఫిర్యాదు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని చెరువు మాదారం గ్రామంలో ఓ భూస్వామి దౌర్జన్య కాండపై దళిత బాధితులు మన ప్రజావాణి ప్రతినిధి వీరభద్రం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు. మందా కృష్ణ మాదిగకు ఫిర్యాదు చేశారు. భూ వ్యవహారంపై జరుగుతున్న పరిణామాలు జరిగిన పరిణామాలపై కృష్ణ మాదిగ తో చర్చించారు. విలేకరి పై దౌర్జన్యం చేసిన వ్యవహారంలో బృందంతో మాట్లాడి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కృష్ణ మాదిగ హామీ ఇచ్చారు. ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చిన జాతీయ రాష్ట్ర కమిటీ నాయకులు కృష్ణ మాదిగకు చెరువు మాదారం గ్రానైట్ వ్యవహారాన్ని ఎన్నో ఏళ్ల నుండి భూములు నమ్ముకొని జీవనం గడుపుతున్న దళితులకు శాపంగా మారినట్లు బృందం కృష్ణ మాదిగ దృష్టికి తీసుకెళ్లారు. దళితుల పక్షాన నిజాలను వార్త కథనాలుగా అందిస్తున్న విలేకరి వీరభద్రంపై కూడా ఆదివారం ఉదయం ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేసి చంపేస్తా అంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు జరిగిన సంఘటనపై వివరించారు.ఈ కార్యక్రమంలో భాష పాక వెంకటరత్నం, నందిగామ విద్యాసాగర్, సూరేపల్లి శ్రీను, సూరే పల్లి శంకర్, సూరే పల్లి శ్యాంసుందర్, బండ్ల పూర్ణచంద్రరావు, సూరే పల్లి అబ్రహం, సూరేపల్లి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.