విద్యుత్ యాదాద్రి పవర్ ప్లాంట్ లో ప్రైవేటీకరణకు నిరసనగా ఉద్యోగులు , కార్మికులు , ఇంజనీర్లు
ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పవర్ ప్లాంట్ యాష్ కోల్ రంగాలను అవుట్సోర్సింగ్ లో నిర్వహించడానికి టెండర్లు పిలిచిన ధానికి వ్యతిరేకంగా టిఎస్ పి ఈ జేఏసీ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు . కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేయడంలో చాలా ముందుకు వెళుతున్నాయని వీటిని తాము తీవ్రంగా ఎదుర్కొంటామని జాయింట్ యాక్షన్ కమిటీ వారు అన్నారు . రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు , జనరేటింగ్ స్టేషన్లలో రోజు ప్రైవేటీకరణ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో ఉద్యోగ , కార్మిక , ఇంజనీర్ సంఘాలు పాల్గొంటున్నారని వారు తెలిపారు . ఈ నిరసన కార్యక్రమానికి 1104 యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి టి .శేషగిరిరావు , 327 కార్యదర్శి సీతారాం గోపాల్ , సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం .ప్రసాద్ , ఇంజనీర్ల సంఘా నాయకులు , తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ బ్రాంచ్ సెక్రటరీ పి యన్ వి.విక్రమ్ , సర్కిల్ సెక్రెటరీ రామకృష్ణ , సతీష్ , తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ బ్రాంచి సెక్రటరీ టి.కిరణ్ , ఎస్.కె ఖాదర్ బాబా , లక్ష్మీ ప్రియ , భవాని , యూనియన్ నాయకులు శ్రీధర్ , పి.సురేష్ , ఏ. రవికుమార్ , డి ఉపేందర్ , మానస , రజిని , కిరీటి , వివేక్ , శివరామకృష్ణారెడ్డి , ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .