విద్యా వాలెంటర్ ను నియమించుటకు 10వేలు ఆర్థిక సాయం అందజేసిన దాత పూలపెల్లి యాదవరెడ్డి
అడ్డగూడూరు 27 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చిన్న పడిశాల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నందున పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని అదే గ్రామానికి చెందిన పూలపెల్లి యాదవ రెడ్డి మానవత దృక్పథంతో విద్య వాలంటర్ నియమించుటకు తన వంతు సహాయంగా 10వేల ఆర్థిక సహాయం అందజేశారు.మన గ్రామ అభివృద్ధి కొరకు మన గ్రామ పిల్లలను చదువుపై శ్రద్ధ కలిగించేలా మన గ్రామం నుండి ఈ విద్యా సంవత్సరం చివరి వరకు విద్యావేత్తలు, వ్యాపారస్తులు,ప్రజా ప్రతినిధులు,గ్రామ ఉద్యోగస్తులు,యువకుల సహాయ సహకారాలు అందించాలని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటాద్రి,ఉపాధ్యాయులు మహేష్,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జె సరిత,ఏఏపిసి చైర్ పర్సన్ ఎ కల్పన పాల్గొన్నారు.