అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ

Apr 8, 2026 - 19:06
 0  5
అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ

అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు.

జోగులాంబ గద్వాల 8 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : అలంపూర్ నియోజకవర్గo లో అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి మరియు పౌష్టికాహార పంపిణీని మరింత సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అలంపూర్ ఎమ్మెల్యే  పేర్కొన్నారు. ఆలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి, అయిజ, మానవపాడు, అలంపూర్, మరియు ఎర్రవల్లి మండలాల్లోని వివిధ గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్లకు ఆయన బుధవారం 226 మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంగన్‌వాడీ టీచర్లు నిత్యం క్షేత్రస్థాయిలో ఉంటూ గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు మరియు విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందేలా చూడాలని పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుజాతమ్మ ఐసిడిఎస్ అధికారులు మరియు అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333