విద్యార్థుల ఆరోగ్యమే మహాభాగ్యం
తిరుమలగిరి 06 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- వెలిశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ విద్యార్థుల విద్యా పురోగతిని పరిశీలిస్తూ, ఉపాధ్యాయులతో కలిసి తరగతి గదులను సందర్శించి బోధన విధానంపై సమీక్ష నిర్వహించడం జరిగింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాల ఆవరణలో దోమలు వ్యాప్తి చెందకుండా ప్రత్యేకంగా యాంటీ లార్వా/దోమల నివారణ మందు పిచికారీ చేయించడం జరిగింది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం జరిగింది. గ్రామపంచాయతీ పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్య రక్షణ, నాణ్యమైన విద్య అందించేందుకు నిరంతరం కృషి కొనసాగుతోంది.
విద్యార్థుల ఆరోగ్యం – విద్య రెండూ సమానంగా ముఖ్యమైనవి. ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేస్తూ, ప్రతి విద్యార్థికి సురక్షితమైన, పరిశుభ్రమైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అరుణ్ గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు