విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని కృషి చేయాలి....జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ .

Mar 15, 2025 - 20:46
Mar 15, 2025 - 20:48
 0  2
విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని కృషి చేయాలి....జిల్లా ఎస్పీ   కె నరసింహ ఐపీఎస్ .

- చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. 

- పెద్దవారిని మహిళలను గౌరవించాలి. 

- రోడ్డు భద్రత, సైబర్ మోసాలు, డ్రగ్స్ నిర్మూల సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఇతరులను చైతన్య పరచడంలో ముందుండాలి.

మునగాల 15 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులు సద్వినియోగం చేసుకోవాలి. మునగాల పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు మునగాల మండల కేంద్రంలో గల ప్రభుత్వ మోడల్ పాఠశాల నందు విద్యార్థులకు లక్ష్యాలు సాధించడం, మంచి అలవాట్లు అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సు నందు జిల్లా ఎస్పీ శ్రీ కే నరసింహ ఐపిఎస్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు సలహాలు అందించి వారిలో ఉత్సాహం నింపినారు. ఎస్పీ గారు చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు సామాగ్రి అందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ యువత విద్యార్థులు దేశ సంపద దేశ భవిష్యత్తు విద్యార్థులు యువతపై ఆధారపడి ఉన్నది కావున విద్యార్థుల్లో యువతలో మార్పు రావాలి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బాధ్యతగా నడుచుకోవాలని కోరారు. తోటి విద్యార్థులతో మంచిగా కలిసిమెలిసి ఉండాలి అన్నారు. విద్యార్థులు లక్ష్యాలను పెంచుకొని అవి సాధించే దిశలో కృషి చేయాలని, భవిష్యత్తులో మంచి స్థాయికి గురువులకు తల్లిదండ్రులకు సొంత గ్రామానికి మంచి పేరు తేవాలని కోరారు. ప్రభుత్వాలు మంచి వసతులతో మంచి విద్యాబోధనని అందిస్తున్నాయని ప్రతి ఒక్కరు చదువుల్లో ముందుండాలని కష్టపడి చదువుకోవాలని నేర్చుకోవాలన్న తపన ప్రతి వారిలో ఉండాలని అన్నారు. ఉపాధ్యాయులు చెప్పే అంశాలను శ్రద్ధగా ఆసక్తితో నేర్చుకోవాలని అన్నారు. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రభావం చాలా ఉన్నది విద్యార్థులు దాని ప్రభావానికి లోనవలుండా మంచి కోసం సద్వినియోగం చేసుకోవాలి. రోడ్డు భద్రత, డ్రగ్స్ నిర్మూల, సైబర్ మోసాల నిర్మూల, మహిళలపై వేధింపు, బెట్టింగ్ లులాంటి సామాజిక అంశాలు అసాంఘిక చర్యలు నిర్మూలించడంలో సమాజంలో చైతన్యం కలిగించాలి అన్నారు. బాధ్యతగా ఉండాలని కోరారు. డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యం అవుతుంది, భవిష్యత్తు నాశనం అవుతుంది డ్రగ్స్ కు దూరంగా ఉండాలి అన్నారు. మహిళలను పెద్దవారిని గౌరవించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మునగాల సర్కిల్ CI రామకృష్ణా రెడ్డి, SI ప్రవీణ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, పౌరులు అన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State