విద్యార్థినుల ఆరోగ్యం,భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి
విద్యార్థినులకు పోషకాహారంతో కూడిన,నాణ్యమైన ఆహారం అందించాలి.
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)ను సందర్శించిన అదనపు కలెక్టర్ నర్సింగరావు.
జోగులాంబ గద్వాల 7 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ధరూర్. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)ను సందర్శించిన అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు విద్యార్థినులకు మెరుగైన విద్యతో పాటు అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు అధికారులను ఆదేశించారు. మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)ను సందర్శించి పాఠశాల నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, అల్పాహారం నాణ్యతను తనిఖీ చేశారు.వంటశాలను పరిశీలించి పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఆరా తీశారు. విద్యార్థినులకు పోషకాహారంతో కూడిన,నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.అలాగే విద్యార్థినులకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలు,తరగతి గదులు, మరుగుదొడ్లు,తాగునీటి సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థినుల ఆరోగ్యం,భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.