వికలాంగుల హక్కుల పోరాట సమితి VHPS చేయుత చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి CPHPS మరియు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో

Sep 15, 2025 - 17:07
Sep 15, 2025 - 19:27
 0  15
వికలాంగుల హక్కుల పోరాట సమితి VHPS చేయుత చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి CPHPS మరియు ఎమ్మార్పీఎస్   ఆధ్వర్యంలో

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ : వికలాంగుల హక్కుల పోరాట సమితి VHPS చేయుత చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి CPHPS మరియు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముట్టడి ..."* *"పెన్షన్లు పెంచే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం చేస్తూనే ఉంటాం* ఆత్మకూరు ఎస్ :దివ్యాంగులకు, వితంతువులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పింఛను వెంటనే పెంచాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తాసిల్దార్ ఎదుట సోమవారం చేపట్టిన ధర్నాలో మేడి కృష్ణ మాదిగ మాట్లాడుతూ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడు స్తున్నా.. పింఛన్ల పెంపును పట్టించుకోకపోవడం దారుణ మన్నారు. ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు 6000 పెన్షన్ చేయూత పెన్షన్ దారులకు 4000 పెన్షన్ పెంచే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఇరవై నెలలు గడుస్తున్నా కూడా పెన్షన్ల మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా 45 లక్షల మంది పెన్షన్ దారులను మరియు కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న పది లక్షల మందిని రేవంత్ రెడ్డి మోసం చేశారని మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ అమిన్ సింగ్ వినతిపత్ర అందజేశారు ఈ కార్యక్రమంలో వీ హెచ్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి జహీర్ బాబా ఎం ఎస్ పి మండల అధ్యక్షులు నవీన్ మాదిగ, ఉపాధ్యక్షులు పిడమర్తి ఉమేష్ మాదిగ, అధికార ప్రతినిధి మిరియాల చిన్ని మాదిగ, బొల్లె పాక మహేష్ ,పల్లెలు నాగయ్య, బండి ఎల్లయ్య, ధర్మల నగేష్, కొప్పుల కళింగ రెడ్డి, బూడిద రామస్వామి, పిడమర్తి శీను మరి పెళ్లి శ్రీనివాస్, పాండవుల లింగయ్య, బత్తుల జంపయ్య, యశోద జానీ నవీన్,