వాసవి యూత్ క్లబ్ మహాలయ అమావాస్య అన్నదాన కార్యక్రమం.

Oct 3, 2024 - 09:47
 0  9
వాసవి యూత్ క్లబ్ మహాలయ  అమావాస్య అన్నదాన కార్యక్రమం.

*వాసవి యూత్ క్లబ్ మహాలయ అమావాస్య అన్నదాన కార్యక్రమం*

*,ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేణారెడ్డి, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్*

వాసవి యూత్ క్లబ్ జోన్ చైర్మన్ యామా సంతోష్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేణారెడ్డి, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. 

మహాలయ అమావాస్య సందర్భంగా స్ధానిక ఎంజి రోడ్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదానం కార్యక్రమాన్ని పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేణారెడ్డి, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వాసవి యూత్ క్లబ్ ద్వారా యామా సంతోష్, శ్రీరంగం రాము, వారి మిత్రబృందం ఆధ్వర్యంలో చేసే సేవా కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో వాసవి యూత్ క్లబ్ ద్వారా గత రెండు సంవత్సరాల నుండి ఏరియా ఆసుపత్రి నందు అల్పాహారం పంపిణీ, ప్రతి నెల అమావాస్య రోజున అన్నదానం చేస్తున్న యూత్ క్లబ్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అతిధులను ఘనంగా సన్మానించారు. అనంతరం వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, కౌన్సిలర్ లు బైరు శైలేందర్, ఎలిమినేటి అభినయ్, వేములకొండ పద్మ, 

చింతమల్ల రమేష్, పోలగాని బాలు గౌడ్, గండూరి రమేష్, పబ్లిక్ క్లబ్ ఇసి మెంబర్ రాచకొండ శ్రీనివాస్, 

రుద్రంగి రవి, నాగుల వాసు, సాయినేత, వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223