బతుకమ్మ దేవి నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలని . మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి.
*తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ..
తెలంగాణ వార్త సూర్యపేట జిల్లా ప్రతినిధి.
*బతుకమ్మతో విశ్వవ్యాప్తమైన తెలంగాణ సంస్కృతి..*
*అధికారికంగా పండగ నిర్వహణ కెసిఆర్ ఘనతే..*
*బతుకమ్మ, దేవినవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలి..*
*ప్రజలందరికీ బతుకమ్మ, శరన్నవరాత్రుల శుభాకాంక్షలు..*
*- మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి*
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. బుధవారం పెత్ర అమావాస్యతో ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలతో పాటు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే బతుకమ్మ తెలంగాణ ఉద్యమంతో కండాంతరాలకు విస్తరించిందని తెలిపారు. సాధించిన తెలంగాణలో బతుకమ్మను అధికారికంగా నిర్వహింకునేలా చేసిన ఘనత ఆనాటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కె దక్కుతుందన్నారు. ఆనాటి నుంచే బతుకమ్మ పర్వదినాన్ని అధికారికంగా జరుపుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే ప్రతి బతుకమ్మ పండుగకు రాష్ట్రవ్యాప్తంగా ఆడపడుచులకు పెద్దన్నగా బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేసి.. తెలంగాణ మహిళల పట్ల కెసిఆర్ కు ఉన్న ఆదరాభిమానాలను చాటుకున్నారన్న విషయాన్ని గుర్తు చేస్తూ ప్రజలందరికీ ఆయన బతుకమ్మ, దేవీ శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.