వావిలాలలో  స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ 

Aug 25, 2026 - 17:17
Aug 25, 2026 - 19:47
 0  9
వావిలాలలో  స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ 
వావిలాలలో  స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ 

పేదలకు సన్నబియ్యం అందించడం అభినందనీయం 

 ఇటిక్యాల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యు ఆంజనేయులు. 

 జోగులాంబ గద్వాల 25 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం వావిలాలగ్రామంలో సర్పంచ్ చిన్న మోహన్ గౌడ్ & ఇటిక్యాల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యు ఆంజనేయులు ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  ఇటిక్యాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యు ఆంజనేయులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిన్న మోహన్ గౌడ్ మాట్లాడుతూ   రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా నాణ్యమైన సన్నబియ్యం అందించే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.  వావిలాల జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆవరణ నందు సర్పంచ్ &ఆధ్వర్యంలో మొక్కలు నాటి మొక్కలకు నీరు పోయడం జరిగింది. కార్యక్రమంలో ఇటిక్యాల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యు ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి, జిపిఓ, రేషన్ డీలర్ హై స్కూల్ హెడ్ మాస్టర్, ప్రాథమిక ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్  మద్దిలేటి,ఉపసర్పంచ్ గ్రామ వార్డ్ వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State