వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి

Apr 22, 2025 - 20:09
 0  8
వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి

అడ్డగూడూరు22 ఏప్రిల్ 2025  తెలంగాణవార్త రిపోర్టర్:- వరంగల్లో 27న జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని అడ్డగూడూరు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.మండల కేంద్రంలో యంఆర్  ఫంక్షన్ హాల్లో నిర్వహించిన  ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని,ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  నాయకత్వంలో ఈనెల 27న వరంగల్లో జరిగే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.అనంతరం బహిరంగ సభ వాలు పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో దర్శనాల అంజయ్య,పొన్నాల వెంకటేశ్వర్లు,చిప్పలపల్లి మహేంద్ర నాథ్, పూలపల్లి  జనార్దన్ రెడ్డి,   సత్యం గౌడ్,దేవగిరి,కిరణ్,నరేష్, రమేష్,బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333