వసతులు కానరాని, భద్రత లేని, దుర్భర పరిస్థితుల్లో పీజీ వైద్య విద్యార్థులు.
ప్రైవేటు కళాశాలల యాజమాన్యం ఇష్టారాజ్యమని పలు ఆరోపణలు
కోల్కతా సంఘటన నేపథ్యంలో విద్యార్థినుల్లో అలముకున్న ఆందోళన
పరిష్కార దిశగా రక్షణ,వసతులకై చర్యల బాధ్యత ప్రభుత్వాలదే.*
వడ్డేపల్లి మల్లేశం
ముఖ్యంగా విద్యారంగంలో ప్రైవేటు భాగస్వామ్యం కారణంగా లాభా పేక్షతో కూడిన నేపథ్యంలో అరకొర వసతుల మధ్యన అధిక పనిని తీసుకోవడానికి ఆరాటపడుతున్నటువంటి యాజమాన్యాలు పని పరిస్థితుల మెరుగుదల గురించి, భద్రత గురించి మాత్రం ఆలోచించడం లేదు. ఇటీవల కోల్కత్తాలో జరిగినటువంటి అర్జీకర్ వైద్య కళాశాల లో వైద్య విద్యార్థిని పైన అత్యాచారం హత్య సంఘటన ప్రధానంగా చెప్పుకోవచ్చు . ప్రభుత్వ రంగంలోని వైద్య కళాశాలలు విద్యాసంస్థలు అయినప్పటికీ కూడా అరకొ ర వసతులు ,అశ్రద్ధ, అమానవీయ నాయకత్వం కారణంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడాన్ని ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకో ని కారణంగా అనేక దుస్స0 ఘటనలకు ఆలవాలమవుతున్నాయి విద్యాసంస్థలు.
ముఖ్యంగా ప్రాణాలను కాపాడి రోగాల నుండి విముక్తి చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించే రంగంలో పనిచేస్తున్నటువంటి
పీజీ వైద్య విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల పైన ప్రత్యేక కథనాలు రావడం వాటిపైన ప్రభుత్వం స్పందించవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నయి. కలకత్తా సంఘటన నేపథ్యంలో మరింత దృష్టి సారించి ఉక్కు పాద మోపాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది.
వైద్య కళాశాలలోని ఆందోళనకర పరిస్థితులు:-
***********
ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలు వాటికి అనుబంధ ఆసుపత్రుల్లో నెలకొన్నటువంటి పరిస్థితులను గమనించినప్పుడు రోగులతో పాటుగా అందులో పని చేసే వైద్య సిబ్బందికి కూడా తగినటువంటి ప్రాథమిక సౌకర్యాలతో పాటు విశ్రాంతి తీసుకోవడానికి ఇతరత్రా సౌకర్యాలు భారీగా ఉండవలసిన అవసరం ఉంది. కానీ ఇటీవల కోల్కత్తాలో జరిగిన సంఘటనలో అప్పటికే 36 గంటల పైగా పని చేసినటువంటి వైద్య విద్యార్థిని విశ్రాంతి తీసుకోవడానికి కూడా ప్రత్యేక సౌకర్యం లేని కారణంగా సెమినార్ హాల్లోనే ఒంటరిగా విశ్రాంతి తీసుకోవడం ఆ నేపథ్యంలోనే అత్యాచారం హత్య జరగడoపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోతే ఎలా ? ముఖ్యంగా ప్రైవేట్ కళాశాలలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయని భద్రత ప్రశ్నార్ధకంగా మారిందని సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులలో నెట్టుకు రావాల్సి వస్తున్నదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయడాన్నీ మనం గమనించాలి. ఇక ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా స్టైఫండ్, అందుతున్న సౌకర్యాలు అంతo మా త్రమేనని ప్రైవేటు కళాశాలలో styfund ఇచ్చినప్పటికీ మళ్ళీ తిరిగి ఏదో రూపంలో తీసుకోవడమే జరుగుతున్నదని ఆరోపణలు వినవస్తున్నాయి. . ముఖ్యంగా వైద్య విద్యార్థులలో మహిళా విద్యార్థులకు మాత్రం ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి 36 నుండి 60 గంటల వరకు కూడా మెడికల్ కాలేజీల ఆసుపత్రిలో విధులను నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రో గుల మధ్యనే ఉంటూ వైద్య సేవలు అందించే విద్యార్థులకు పలుచోట్ల మరుగుదొడ్లు మూత్రశాలల వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో అప్పుడప్పుడు మరుగుదొడ్లలోనే స్నానాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయని వైద్య విద్యార్థులు ప్రకటించడాన్ని బట్టి మన రాష్ట్ర పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అనారోగ్యకరమైన వాతావరణంలో ఉన్నటువంటి మూత్రశాలలు మరుగుదొడ్లు, వినియోగించుకోవడానికి భయపడుతున్న నేపథ్యంలో కొన్ని కాలేజీలలో కనీసం వారానికి ఒకసారి కూడా శుభ్రం చేయని కారణంగా అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా పత్రికల ద్వారా తెలుస్తున్నది .. ముఖ్యంగా ప్రైవేట్ కళాశాలలో పీజీ వైద్య విద్యార్థులకు 50 వేల నుంచి లక్ష వరకు కాలేజీ చెల్లిస్తున్న సందర్భంలో కొంతమంది చెల్లించకపోవడం మరికొన్ని చోట్ల విద్యార్థుల ఖాతాల్లో జమ చేసి తిరిగి చెక్కుల రూపంలో తీసుకోవడం వంటి దుర్మార్గపు పద్ధతులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తున్నది ఈ విషయంలో వైద్య శాఖతో పాటు ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉన్నది . స్టైఫండ్ కోసం హైదరాబాదులోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇటీవల ధర్నా నిర్వహించినట్లుగా తెలుస్తుంటే కళాశాల యాజమాన్యం బెదిరించి పంపినట్లుగా పత్రిక కథనం అంటే ఒకవైపు ప్రభుత్వ కళాశాలలో సౌకర్యాలు అరకొరగా ఉండడంతో పాటు ప్రైవేటు కళాశాలలో కూడా సౌకర్యాలు లేమి తో పాటు స్టేఫండ్ను ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్న నేపథ్యంలో ప్రభుత్వము దృష్టి సారించి ఉక్కు పాద మోపాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. అంతేకాదు ముఖ్యంగా మహిళ విద్యార్థుల నేపథ్యంలో అవసరమైనటువంటి వాష్ రూమ్స్ విశ్రాంతి గదులు రక్షణ వ్యవస్థను కూడా కల్పించవలసిన అవసరం ఉంది ఎందుకంటే రాత్రి పూట పనిచేస్తున్న సందర్భంలో అలసి నిద్రపోతున్న వేళ ఎలాంటి అకృత్యాలైన జరిగే ఆస్కారం ఉన్నదని ఇటీవలే కోల్కత్తా సంఘటన తెలియజేస్తున్నది కదా !
రోగుల పక్కనే నిద్రించవలసి రావడం:-
*********
వైద్యరంగంలో పనిచేసే డాక్టర్లు 36 గంటలు ఆపైన కూడా పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఉంటున్నట్లుగా నిపుణులు అంచనా వేస్తూ కథనాలు రాస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణమైనటువంటి విశ్రాంతి తీసుకోవడానికి వసతులు కల్పించవలసిన బాధ్యత ఆ కళాశాలల యాజమాన్యాలు, ప్రభుత్వాలదే. విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక గదులు లేకపోవడంతో కారిడార్లను రోగుల మంచాల పక్కనే కింద నిద్రపోతూ విశ్రాంతి తీసుకోవలసినటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నట్లుగా తెలుస్తున్నది. అలసిపోయిన సందర్భంలో నిద్రపోయే వేళ సురక్షితము కానటువంటి పరిస్థితులు ఎదురైతే అక్కడ జరిగే పరిణామాలకు బాధ్యులు ఎవరు? ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కోల్కత్తా సంఘటనతో పాటు అనేక సంఘటనలు నేపథ్యంలో ఈ అంశం పైన పాలకులు ప్రైవేటు యాజమాన్యాలు దృష్టి సారించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. చుట్టూ రోగులు, వైద్య సిబ్బంది అధికారులు ఉన్నట్లే కనపడిన ఇంత మంది నడుమ అలాంటి దుర్భర సంఘటనలు జరుగుతున్న వేల వారికి మనసు ఎలా ఒప్పుతుంది ? ముఖ్యంగా ప్రైవేట్ కళాశాలలో పనిచేసే వైద్య విద్యార్థులకు యాజమాన్యాలు భోజన సౌకర్యం కల్పించాలని నిబంధన ఉన్నప్పటికీ చాలా చోట్ల ఆ నిబంధన పాటించడం లేదని కొన్నిచోట్ల క్యాంటీన్లు ఉన్న ఆహారంలో నాణ్యత పరిశుభ్రత లేని కారణంగా తినలేక పోతున్నట్లు శుభ్రమైన నీళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో నీళ్లు తాగడానికి కూడా వెనుకడుగు వేస్తున్నట్లు పత్రికల్లో అనేక కథనాలు రావడం మన రాష్ట్ర పరువును ప్రతిష్టను దిగజార్చడమే అవుతుంది . బాత్రూములు కూడా లేకపోవడంతో విద్యార్థులు అధ్యాపక సిబ్బందికి కేటాయించిన గదులకు వచ్చి వినియోగించుకుంటున్నట్లు తద్వారా అనేక అనర్థాలు జరుగుతున్నట్లు పత్రికల సమాచారం బట్టి తెలుస్తున్నది అంటే మౌలిక సౌకర్యాల కల్పనలో యాజమాన్యాలు ప్రభుత్వం విఫలం కావడం వల్లనే కదా .!
ఒక అనర్ధం జరగడానికి కారణాలు ఎన్నో అలాగే పరిష్కార మార్గాలు కూడా అంతకు మించిన స్థాయిలో ఆలోచించినప్పుడు మాత్రమే సంఘటనలు అత్యాచారాలు హత్యలు వంటి దుర్భర పరిస్థితుల నుండి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైన బాధ్యత పాలకులకు యాజమాన్యాలకు ఉండాలి. ఒక కళాశాల నిర్మించినప్పుడు అవసరాలు ఏమిటి? ఎదురయ్యే పరిస్థితులు ఏమిటి ?వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? అనే ఆలోచన అధికారుల్లోనూ సిబ్బంది లోనూ ప్రభుత్వ పెద్దల్లోనూ చివరికి ఆయా రంగాల నిపుణులకు ఆలోచన సరిగా ఉన్నప్పుడు మాత్రమే భద్రత పొందే అవకాశం ఉంటుంది . చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా కూడా జరిగే పరిణామాలు పెద్ద మొత్తంలో జరుగుతున్నట్లు ఇటీవల సంఘటనలను బట్టి తెలుస్తున్నది కదా ! ప్రభుత్వ పరువు ప్రతిష్టను దిగజార్చే సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రైవేటు యాజమాన్యాల పైన ఉక్కు పాదం మోపడానికి ప్రభుత్వ కళాశాలలో చర్యలు తీసుకుని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వాలు చొరవ చూపడం లేదంటే అది పాలకుల యొక్క నిర్లక్ష్యమే అని చెప్పక తప్పదు. అందుకు తగిన మూల్యం చెల్లించవలసి వస్తున్న సందర్భంగా నైనా వైద్యులను సిబ్బందిని విద్యార్థులను ముఖ్యంగా మహిళ వైద్య విద్యార్థుల రక్షణ గురించి ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించాలి. అందుకు తగిన సలహాలు సూచనలను నిపుణుల నుండి తీసుకోవడంతో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడు మాత్రమే పత్రికల్లో ఇలాంటి కథనాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కావు జరగకూడని సంఘటనలు జరగవు. భద్రతగా ఆత్మవిశ్వాసంగా బాధ్యతాయుతంగా సిబ్బంది కూడా పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మహిళా సిబ్బందిని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా పూర్తి భద్రత కల్పించాలి.అయితే ఈ రకమైనటువంటి సంఘటనలు ప్రాంతాలకు అతీతంగా కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వైద్య కళాశాలలో పకడ్బందీగా వసతులను కల్పించి కట్టు ది ట్టమైన చర్యలను తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతగానో ఉన్నది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)