వనంలో ఘనంగా సమ్మక్క సారలమ్మ జాతర
విశేష పూజలందుకున్న గ్రామ వనదేవతలు
వనదేవతల గద్దెలను తన సొంత ఖర్చులతో నిర్మించిన ఓబీసీ సెల్ అధ్యక్షులు రుద్ర రామచంద్రు
తుంగతుర్తి ఫిబ్రవరి 23: తెలంగాణవార్త ప్రతినిధి:- గానుగుబండ గ్రామంలో వనంలోని ఘనంగా సమ్మక్క సారలమ్మ మినీ జాతరను గ్రామ ప్రజలు ఘనంగా గత పది సంవత్సరాలుగా సమ్మక్క సారలమ్మ జాతరను గ్రామ మాజీ సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి, ఓబిసి సెల్ అధ్యక్షులు రుద్ర రామచంద్రు ఆధ్వర్యంలో గ్రామ ప్రజల నడుమ అంగరంగ వైభవంగా బోనాలతో వాడ వాడల ఊరేగింపులతో డప్పు చప్పులతో నృత్యాలతో ఆట పాటలతో గ్రామ ప్రజలు మినీ జాతరను జరుపుకుంటారు.
వనదేవతలను సమ్మక్క-సారక్క. మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. గ్రామ ప్రజలు, భక్తులు, తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క-సారలమ్మ జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరుగుతోంది.
గిరిజనులు కొలిచే ఆరాధ్య వనదేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, కేవలం తెలంగాణలోనే గాక భారత దేశంలోనే వనదేవతులుగా
పూజలందుకుకుంటున్నారు.
తుంగతుర్తి మండలంలోని గానుగుబండ గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని ఈ మీని జాతరను గ్రామ ప్రజల కమిటీ ఇష్టం మేరకే జాతరను ఘనంగా జరుపుకున్నారని అన్నారు.
గ్రామ ప్రజలు మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ దేవతలు కోరిక కోరికలు తీర్చే తల్లులు అని గ్రామ నమ్మకం మా గ్రామంలో వనదేవతలు ఎంతో విశేష పూజలందుకున్నందున ఆ తల్లుల ఆశీస్సులు మా గ్రామ ప్రజలకు ఉంటాయని హర్షం వ్యక్తం చేశారు.