అక్షర ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవం...

Feb 23, 2024 - 18:56
 0  20
అక్షర ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవం...

- ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఇష్టంతో కష్టమైన సరే భవిష్యత్తులో వివిధ రంగాలలో విద్యార్థులు ఎదిగి ఉన్నంత పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం....

• బాల్య దశ నుండి విద్యార్థుల్లో సృజనాత్మకతను, నైపుణ్యాలను వెలికి తీయాలనే ఆలోచనతో పాఠశాల స్థాయిలోనే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం..

అక్షర ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ మహేందర్

జోగులాంబ గద్వాల 23 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-  మున్సిపాలిటీలో అక్షర ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వయం పరిపాలనా దినోత్సవం లో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ గా కె.ప్రకాష్, హెడ్మాస్టర్ గా బి.భార్గవ్,పీఈటీలుగా కె.శివ, బి. చందు,ఎం.తరుణ్,డీఈవోగా కె .జస్వంత్,ఎంఈఓ గా సందీప్ కుమార్ లు మరియు వివిధ పోస్టులలో హోదాల్లో క్రమశిక్షణతో చాలా హుందాగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... విద్యార్థులు భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉద్యోగాలు సంపాదించి ప్రజలకు సేవ చేయాలని ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఇష్టంతో కష్టమైన సరే భవిష్యత్తులో వివిధ రంగాలలో విద్యార్థులు ఎదిగి ఉన్నంత పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం అని అన్నారు..బాల్య దశ నుండి విద్యార్థుల్లో సృజనాత్మకతను, నైపుణ్యాలను వెలికి తీయాలనే ఆలోచనతో పాఠశాల స్థాయిలోనే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని నాయకత్వ లక్షణాలను అభివృద్ధి పరిచేందుకు క్రమశిక్షణను పెంపొందించేందుకు స్వయం పరిపాలన దినోత్సవం దోహద పడుతుందని విద్యార్థుల్లో ఒక ఆకాంక్షను ఏర్పరుస్తుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు...

ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకటేష్,ప్రతాప్,మాధవి,PET లు నరేష్,శ్యామ్ ,శివరాజ్, మరియు పాఠశాల బృందం తదితరులు పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333