వడదెబ్బతో వ్యక్తి మృతి
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ వడదెబ్బతో వ్యక్తి మృతి. గత మూడు రోజులుగా విస్తున్న వడ గాలులకు తట్టుకోలేక వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఇస్తాలాపురం లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మడిపల్లి ఐలయ్య(66) గత మూడు రోజులుగా అస్వస్థతకు గురై ఇంటి వద్ద చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. గత నాలుగు రోజులుగా వీస్తున్న వడ గాడు పులకు తట్టుకోలేక వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.