వజ్ర హోమ్స్ లో వారికి ఎలాంటి భూమి లేదు

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్

Apr 12, 2026 - 21:25
Apr 12, 2026 - 21:30
 0  8
వజ్ర హోమ్స్ లో వారికి ఎలాంటి భూమి లేదు

వజ్ర హోమ్స్ లో అక్రమంగా 9000 గజాలను అక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట, 12 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో ఉన్న వజ్రా హోమ్స్ లో 2015 నుంచి 2018 వరకు అన్ని అనుమతులు తీసుకొని సక్రమ రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నారని ప్రస్తుతం నల్ల ఉమా జ్యోతి రెడ్డి తప్పుడు దస్తావేజులు సృష్టించి అక్రమంగా కొందరు  వజ్రా హోమ్స్ లో స్థలాలను ఆక్రమించుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. ఆదివారం వజ్రా హోమ్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నన్ను ఉమా జ్యోతి రెడ్డికి వజ్రా హోమ్స్ లో ఎలాంటి భూమి లేకుండా తప్పుడు దస్తావేజులు సృష్టించి వజ్రాహుం 9000 గజాలు తన భర్త చిత్తరంజన్ రెడ్డి పేరా ఉన్నట్లు చూపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.

ఈ విషయమై గతంలో తాను చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం కోర్టు కేసులను క్లియర్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మించి తన వద్ద డబ్బులు తీసుకొని ప్రస్తుతం తప్పుడు పత్రాలతో భార్యాభర్తలు కొందరితో అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు. తప్పుడు దస్తావేజుల ద్వారా అగ్రిమెంట్ చేసుకున్న వారిని కూడా మోసం చేయగా వారు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని తెలిపారు. గత ఫిబ్రవరి మాసంలో అమెరికా నుండి హైదరాబాద్ కు వచ్చి నాయకుల అండదండలతో ఎలాంటి భూమి లేకున్నా తప్పుడు దస్తావేజుల ద్వారా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ విషయమై వజ్రా హోమ్స్ మేనేజింగ్ పార్ట్ నర్స్  న్యాయ సలహా మేరకు వజ్రా హోమ్స్ లో నల్ల చిత్తరంజన్ రెడ్డి నల్ల ఉమా జ్యోతి రెడ్డిల ద్వారా ఎలాంటి విక్రయ లావాదేవీలు జరుపకూడదని బహిరంగ ప్రకటన కూడా విడుదల చేయడం జరిగిందనీ ఈ విషయాలు సూర్యాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం నోటీసు ద్వారా కూడా తెలియజేయడం జరిగిందన్నారు. నల్ల ఉమా జ్యోతి రెడ్డి నల్ల చింత రంజన్ రెడ్డి లపై పలుమార్లు చీటింగ్ కేసు అయినప్పటికీ మరల మోసం చేయాలని ఆలోచనతో వజ్రా హోమ్స్ లో ఉన్న ప్లాట్లను ఇండ్ల స్థలాలను ఆక్రమించుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారనీ వీరిపై విచారణ చేసి మరల ఇలాంటి మోసాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333