లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి . ఆర్టీసీ కార్మిక సంఘాలు.

Sep 23, 2024 - 18:56
Sep 23, 2024 - 19:12
 0  1
లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి . ఆర్టీసీ కార్మిక సంఘాలు.

లేబర్ కోడ్స్ రద్దు చేయాలి:ఆర్టీసీ కార్మిక సంఘాలు సూర్యాపేట :-కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందని పూర్తిగా యాజమాన్యాలకు అనుకూలమైన కార్మిక వర్గానికి వ్యతిరేకమైన నూతన లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలని స్టాప్ & వర్కర్స్ యూనియన్ INTUC.డిపో కార్యదర్శి D.రవికుమార్ అన్నారు .జాతీయ కార్మిక సంఘాల బ్లాక్ డే పిలుపులో భాగంగా డిపోలో ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జి ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లు గా విభజించి కార్మిక హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు.కార్మిక వర్గం అనేక త్యాగాలు పోరాటాలతో కార్మిక చట్టాలు సాధించుకున్నారని పిఎఫ్ ,ఈ ఎస్ ఐ, వారాంతపు సెలవులు, కనీస వేతన హక్కు, యాజమాన్యంతో బే రసారాలడే హక్కు లను సాధించుకోగలిగామని వీటి స్థానంలో వేతన కోడ్ , వర్కింగ్ కండిషన్స్ కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్ సామాజిక భద్రత కోడ్ లుగా విభజించి కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కుల్ని హరించే విధంగా చట్టాలను తీసుకువచ్చిందన్నారు. ఈ కోడ్ లు అమల్లోకి వస్తే యాజమాన్యం దయాదాక్షిన్యాలతోటి బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే ఆర్టీసీలో యూనియన్ల అనుమతి లేకపోవడం వల్ల కార్మికుల పక్షాన యాజమాన్యం తో మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.CITU,ఎస్ డబ్ల్యూ ఎఫ్ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్ SWF డిపో కార్యదర్శివి .లక్ష్మయ్య మాట్లాడుతూ లేబర్ కోడ్ లు అమల్లోకి వస్తే ఆర్టీసీలో ఇప్పుడున్న దుర్భర పరిస్థితులు, బానిసత్వం,అణచివేత శాశ్వతం అయ్యే ప్రమాదం పొంచి ఉందని కార్మిక చట్టాలు అమలులో ఉండగానే కార్మికులు నేటికీ బానిసత్వం లోనే మగ్గుతున్నారని ఇవి కూడా రద్దైతే కార్మికుల జీవితాలు ఏమైపోతాయో అని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ మెడలు వంచైనా కార్మిక హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆర్టీసీ రక్షణ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మరో పోరాటానికి సన్నద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రమేష్,వెంకన్న ,గజ్జి .శ్రీను,లింగయ్య ,శ్రీధర్ ,వీరయ్య ,జి ఎం రావు ,అంజయ్య ,శ్రీను,శ్రీకంట్లం ,కృష్ణ నర్సయ్య ,హంజద్ నాయక్, యాకమ్మ ,సావిత్రి ,సైదమ్మ ,ఉమా రాణి ,ఎల్లమ్మ ,జరీన బేగం,సుజాత సత్యవతి,కౌసల్య ,రేణుక తదితరులు పాల్గొన్నారు

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223