* డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన*నేరేడుచర్ల పిఎస్ పరిధి

నేరేడుచర్ల పిఎస్ పరిధి

Sep 9, 2024 - 17:43
Sep 9, 2024 - 18:48
 0  34
* డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన*నేరేడుచర్ల పిఎస్ పరిధి

 నేరాలపై అవగాహన:-నేరేడుచర్ల PS పరిది

*ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు SI రవీందర్ గారు పట్టణంలోని శ్రీవాణి లో షీ టీమ్స్, సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, పోలీసు కళాభృందంతో విద్యార్థిని, విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.* 

 *SI రవీందర్ గారు మాట్లాడుతూ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి అధ్వర్యంలో షి టీమ్స్ సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో, కళాశాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,* *ATM* *కార్డ్ వివరాలు,* *OTP* *వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.* *సైబర్ మోసాలపై* *1930* *టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే *కాలేజి లో హాస్టళ్లు మహిళలపై వేధింపులు జరిగితే షీ టీం వాట్సాప్ నెంబర్*8712686056* *కు* *సమాచారం ఇవ్వాలని తెలిపినారు.* *"టీ సేఫ్" యాప్ పై మహిళలు అవగాహన కలిగియుండాలని అన్నారు* 

*వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు*  

            *యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. *సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన* *పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు* 

 *అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థిని విద్యార్దులకు అవగాహన* *కల్పించారు* 

*ఈ కార్యక్రమం నందు శ్రీవాణి హై స్కూల్ ప్రిన్సిపల్ సీతారాంరెడ్డి, పోలీస్ సిబ్బంది ASI సైదులు కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, క్రిష్ణ, నాగార్జున,చారి, మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.*

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State