లిఫ్ట్ లో పాత పాత సిబ్బందిని క్రమబద్ధీకరించాలి..మేదరమెట్ల వెంకటేశ్వర్లు
మునగాల 09 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-మునగాల మండలం కొక్కిరేణి గ్రామంలోక సిపిఎం పార్టీ గ్రామ శాఖ సమావేశం సీనియర్ నాయకులు ములకలపల్లి సైదులు అధ్యక్షతన జరిగింది. ఈ యొక్క సమావేశానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కొక్కిరేణి లిఫ్ట్ చైర్మన్ మేదరమెట్ల వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న లిఫ్టు ఇరిగేషన్ ఎత్తిపోతల పథకాలలో నూతనంగా లస్కర్లు, హెల్పర్లు నియామకానికి చర్యలు తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని కానీ ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనంతో ఇప్పటివరకు లిఫ్ట్ ఎత్తిపోతల పథకాల్లో విధులు నిర్వహిస్తున్న వారిని ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేయటం సరి అయిందని అన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఏర్పడిన నాటి నుండి ఎత్తిపోతల పథకాన్ని నమ్ముకొని స్థానికంగా ఉన్న కొంతమంది రైతులు, లిఫ్ట్ కమిటీ సభ్యులు లిఫ్ట్ మోటర్లు నడపడం కోసం ఒక్కొక్క లిఫ్టు ఎత్తిపోతల పథకం వద్ద సిబ్బందిని నియమించుకొని ఎత్తిపోతల కార్యక్రమం నిర్వహించడం జరిగేది అని అన్నారు. ఇప్పటివరకు లిఫ్ట్ ఎత్తిపోతల పథకం వద్ద విధులు నిర్వహించిన వారందరినీ వివరాలను సమగ్రంగా విచారణ నిర్వహించి వారిని తిరిగి ప్రభుత్వం లస్కర్లుగా, హెల్పర్లుగా ఉద్యోగులుగా నియమించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కొత్త వారిని తీసుకొచ్చినట్లైతే లిఫ్ట్ ఎత్తిపోతల పథకం పూర్తి నీటి సామర్థ్యం, పంట కాలువల వివరాలు రైతులసాగుల భూములు వివరాలు లిఫ్ట్ ఎత్తిపోతల పథకం నిర్వహణ లోపం కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే పని చేసిన సిబ్బంది నైపుణ్యం, అనుభవం ఎత్తిపోతల పథకం నిర్వాహకులు ఎంతగానో ఉపకరిస్తుందని వారన్నారు.కావున పాతవారిని ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని కొత్తవారిని ఎంపిక ఆలోచన విరమించుకోవాలని. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి నందిగామ సైదులు, మండల కమిటీ సభ్యులు రేఖ లింగయ్య,రావులపెంట బ్రహ్మం, ములకలపల్లి నాగరాజు,మామిడి గురుమూర్తి , రావులపెంట శేషగిరి, సైదులు, రావులపెంటవెంకన్న , నిడికొండ శంబయ్య, ఇంటూరి హుస్సేన్, కామల్ల ప్రసాద్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు..