లబ్ధిదారులకు సంక్షేమ పథకాల అర్హత పత్రాల పంపిణీ

Jan 26, 2025 - 19:30
Jan 26, 2025 - 19:43
 0  29
లబ్ధిదారులకు సంక్షేమ పథకాల అర్హత పత్రాల పంపిణీ

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ లబ్ధిదారులకు సంక్షేమ పథకాల అర్హత పత్రాల పంపిణీ ఆత్మకూర్ ఎస్... మండలం పరిధిలోని మక్త కొత్తగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల, ఇందిరమ్మ ఇండ్లు వంటి నాలుగు సంక్షేమ పథకాలకు మండల అధికారులు లబ్ధిదారులకు ఆదివారం పథకాల మంజూరు పత్రాలను అందజేశారు.నేపథ్యంలో ప్రజాపాలన నాలుగు పథకాల అమలు ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి ఎల్ శ్రీనివాస్ నాయక్ పాల్గొని సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. పేదల కోసం ప్రభుత్వం చేసిన ఈ నాలుగు పథకాలు అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మంజూరైన వారే కాకుండా అర్హత కలిగిన వారు నిరంతరం దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ హరిచంద్ర ప్రసాద్, ఎంపీడీవో హసీం, ఏపీవో ఈశ్వర్, ఎంపీ ఓ రాజేష్, ఆర్డబ్ల్యూసిఐ రవికుమార్, కాంగ్రెస్ పార్టీ జెండా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.