లక్ష గొంతుకల పొలికేక విజయవంతం చేయండి

Aug 24, 2026 - 20:22
 0  2
లక్ష గొంతుకల పొలికేక విజయవంతం చేయండి

బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకి రెడ్డి పిలుపు.
సూర్యాపేట : బుల్లెట్ ట్రైన్ సాధించాలన్న పట్టుదలతో సూర్యాపేట జిల్లా ప్రజలు కొనసాగిస్తున్న ఉద్యమాలకు ప్రజల ఆదరణ అమోఘమైందని ఉద్యమ కార్యక్రమంలో భాగంగా నేడు జరిగే లక్ష గొంతుకల పొలికేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకి రెడ్డి కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు అలాట్మెంట్లు సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వ అలైట్మెంట్ మార్చి జాతీయ రహదారి 65 సమాంతర పట్టణాల మరియుసూర్యాపేట ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అనంతకాలంలోనే బుల్లెట్ ట్రైన్ ఉద్యమం ఊహించని స్థాయిలో జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా కొనసాగుతుందని అని తెలిపారు. మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు ప్రతి ఒక్కరు తమ ఇళ్ల వద్ద లేదా తమ వీధిలో గుమి కూడి ప్రతి ఒక్కరు బుల్లెట్ ట్రైన్ సూర్యాపేటకు రావాలి, బుల్లెట్ ట్రైన్ సాధన కోసం ఉద్యమిస్తాం, అంటూ మూడుసార్లు ఢిల్లీ వరకు మన పొలికేకను వినిపించేలా నినాదాలు చేయాలని కోరారు. జిల్లాలో అఖిలపక్ష ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ సహకారం అందిస్తున్నందున ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని వారు సందర్భంగా కోరారు. మరో స్వాతంత్ర తెలంగాణ ఉద్యమo లా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియని రైల్వే కోసం ఎదురు చూసే కంటే వచ్చిన బుల్లెట్ ట్రైన్ పక్కదారి పట్టిస్తున్న నేతలకు బుద్ధి చెప్పాలంటే ఉద్యమమే మార్గమని ఆయన తెలిపారు. సూర్యాపేట పట్టణంతోపాటు పల్లెల్లోనూ ఈ ఉద్యమం కొనసాగించాలని వారు తెలిపారు. ఇప్పటికే అఖిలపక్షాల ఆధ్వర్యంలో ప్రతి వార్డుకు ప్రతి వీధికి కరపత్రాలతో పాటు ప్లే కార్లు ఫ్లెక్సీలు పంపి ప్రచారం కొనసాగించామని, ప్రతి ఒక్క ఇంటి వద్ద ఈ బుల్లెట్ ట్రైన్ నినాదం తప్పనిసరిగా వినిపించాలని వారు పిలుపునిచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333