'సర్' కార్యక్రమం 100% పూర్తి చేయాలి: టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు

Aug 24, 2026 - 20:51
 0  4
'సర్'  కార్యక్రమం 100% పూర్తి చేయాలి:  టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు

  తుంగతుర్తిలో ‘సర్’ ప్రోగ్రాంను 100% విజయవంతం చేయాలి: టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండేటి మల్లన్న

• ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ‘సర్’ రివ్యూ కార్యక్రమం 

• మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహణ

• మండల అధ్యక్షులు, సూపర్‌వైజర్లతో ముఖాముఖి సమీక్ష

 

తిరుమలగిరి 25 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:

తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రమైన తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ‘సర్’ ప్రోగ్రాంపై కీలక రివ్యూ (సమీక్షా) కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు నేతృత్వంలో, నియోజకవర్గ సర్ కో-ఆర్డినేటర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ రివ్యూ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొండేటి మల్లన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, మండల-పట్టణ నాయకులు, సర్ కమిటీ బూత్ లెవెల్ సూపర్‌వైజర్లు, బీఎల్ఏలు, గ్రామ సర్పంచులు మరియు ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండేటి మల్లన్న మాట్లాడుతూ.. ముఖ్య నాయకులు మీనాక్షి రాజన్  ఆదేశాల మేరకు ఈ ప్రతిష్టాత్మకమైన ‘సర్’ ప్రోగ్రాంను ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ రివ్యూ కార్యక్రమంలో భాగంగా కొండేటి మల్లన్న  నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులను, సర్ ప్రోగ్రాం సూపర్‌వైజర్లను ముఖాముఖిగా అడిగి క్షేత్రస్థాయి వివరాలను తెలుసుకున్నారు. వారి మండలాల్లో కార్యక్రమం ఎలా సాగుతోంది, ఎదురవుతున్న సవాలు ఏమిటనే విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారి నుంచి కీలక సలహాలు, సూచనలను స్వీకరించి, పలు మార్గదర్శకాలను అందించారు.   ప్రతి మండలంలో బూత్ సూపర్‌వైజర్లు, బీఎల్ఏలు, ఇన్‌చార్జీలు ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను భాగస్వామ్యం చేస్తూ ఈ ప్రోగ్రాంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా 100% ఖచ్చితమైన ఫలితాలు రాబట్టాలని ఆయన ముఖ్య సూచనలు చేశారు. నాయకులు, కార్యకర్తలు అంతా ఒకే తాటిపైకి వచ్చి కష్టపడి పనిచేస్తే.. 'సర్' ప్రోగ్రాం అమలులో తెలంగాణ రాష్ట్రంలోనే తుంగతుర్తి నియోజకవర్గం అగ్రస్థానంలో నిలుస్తుందని మల్లన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు కు నియోజకవర్గానికి రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు, గొప్ప పేరు వస్తాయని ఆయన పేర్కొన్నారు 

ఈ కార్యక్రమంలో తొమ్మిది మండలాలకు చెందిన మండల కమిటీ అధ్యక్షులు తిరుమలగిరి మండల కమిటీ అధ్యక్షులు సుంకరి జనార్దన్, మోత్కూర్ మండల పార్టీ అధ్యక్షులు బాలరాజు గౌడ్, అడ్డ గూడూరు మండల కమిటీ అధ్యక్షులు నర్సిరెడ్డి, నాగారం మండల పార్టీ అధ్యక్షులు వెంకట బిక్షం యాదవ్, తుంగతుర్తి మండల కమిటీ అధ్యక్షులు రేగడి రవి, నూతనకల్ మండల కమిటీ అధ్యక్షులు మల్లారెడ్డి, మద్దిరాల మండల కమిటీ అధ్యక్షులు వెంకన్న యాదవ్, జాజిరెడ్డిగూడెం మండల కమిటీ అధ్యక్షులు మధుకర్ రెడ్డి, శాలిగౌరారం మండల కమిటీ అధ్యక్షులు ధనుంజయ్, తిరుమలగిరి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జుమ్మిలాల్ నాయక్, పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్, పత్తేపురం సుధాకర్, ప్రజాప్రతినిధులు గ్రామ సర్పంచ్ ధరావతు చిరంజీవి, పార్టీ ముఖ్య నాయకులు గుగులోతు సుధాకర్, బానోతు రాములు నాయక్, విజయ్, బూతు లెవెల్ సూపర్వైజర్లు, బి ఎల్ ఎ లు, యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి