లంబాడి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి.
లేనియెడల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తున్నాం. బోడ రమేష్ నాయక్
లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మహబూబాబాద్
మహబూబాబాద్ 05 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- ఈరోజు ఎమ్మార్వో సెంటర్లో ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ అతిపెద్ద గిరిజన జిల్లా అయిన మానుకోట జిల్లాలో లంబాడి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే లలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు దాదాపుగా 25 లక్షల మంది ఉన్నారని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 5 లక్షల మంది లంబాడీలు ఉన్నారని అదేవిధంగా అత్యధిక లంబాడీలు కలిగిన ఏకైక పార్లమెంట్ స్థానం మహబూబాబాద్ లో 5 లక్షల మంది లంబాడీలు ఉన్నారని, మహబూబాబాద్ జిల్లాలో 2,75,000 మంది ఉన్నారని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ నియోజకవర్గాలు 12 ఉంటే లంబాడీల సహకారంతో తో దాదాపుగా 30 సీట్లు గెలుస్తాయని అన్నారు. లంబాడీలు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం వలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచిన కూడా ఇప్పటివరకు లంబాడి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. గత ప్రభుత్వంలో లంబాడి సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని, ఈ ప్రభుత్వం మాత్రం లంబాడి సామాజిక వర్గాన్ని విస్మరిస్తుందని అన్నారు. ఇకనైనా జరగబోయే మంత్రివర్గ విస్తరణలో లంబాడి సామాజిక వర్గానికి చెందిన, అతిపెద్ద గిరిజన జిల్లా అయినా మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. లంబాడీలు ఒక్కసారి తిరగబడితే కాంగ్రెస్ పార్టీ పతనమైపోతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ వాసు నాయక్, జిల్లా కార్యదర్శి ధరావత్ రమేష్ నాయక్,బాదావత్ బిక్షం నాయక్, టౌన్ అధ్యక్షుడు హత్తిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.