ర్యాలంపాడులో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు
జోగులాంబ గద్వాల 8 జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం ర్యాలంపాడులో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహారి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులను సమాయత్తం చేస్తుందన్నారు. వారి వెంట జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అధికారులు , కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.