రొమ్ము క్యాన్సర్ నిర్లక్ష్యం ప్రాణాంతకమే
ముందు జాగ్రత్త వైద్య పరీక్షల లేమి కారణమంటున్న వైద్య నిపుణులు.* కారణాలు ఎన్నో.. ముందు చూపుతో మృత్యువాత నుండి తప్పించుకునే అవకాశం ఉంది.*
నిర్లక్ష్యం స్థానంలో మహిళల్లో చైతన్యం రావాలి .*
**************
---వడ్డేపల్లి మల్లేశం 90142206412
---29....05....2025*********
పర్యావరణ కాలుష్యం ముమ్మరం కావడం హరిత విప్లవం మూలంగా రసాయనకి ఎరువులు పురుగు మందుల వాడకం గణనీయంగా పెరగడంతో భూమి నిస్సారం కావడమే కాకుండా దిగుబడి అవుతున్నటువంటి ఆహార గింజలు పోషకాలలేమిటో అనారోగ్యాన్ని కలిగించే విషకారకాలతో నిండి ఉండడం కూడా ప్రజల అనారోగ్యానికి ప్రధాన కారణం అవుతున్నది. ఇటీవల కాలంలో ప్రకృతిలో లభించవలసినటువంటి పోషక విలువలు లేని కారణంగా కృత్రిమంగా నూనెలు, ఉప్పు, గోధుమపిండి, పాలు కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తిను బండారాలలో విటమిన్లు లేదా ఖనిజలవనాలను కలిపి సరఫరా చేస్తున్న సందర్భాన్ని మనం గమనించవచ్చు.అంటే ఎంత దయనీయ స్థితిలో వున్నామో అర్థంచేసుకోవచ్చు.దానిని ఫోర్టిఫీకేషన్ అని శాస్త్రీయంగా పిలుస్తున్నారు. ముఖ్యంగా వారి గోధుమ లాంటి ఆహార ధాన్యాలలో ఉండవలసినటువంటి ఐరన్ జింకు పూర్తిగా లేకపోగా ఆర్సినిక్ అనే విష కారకం ఎక్కువగా ఉండడంతో కూడా అనేక రోగాల బారిన పడడానికి అవకాశం ఏర్పడింది. ఈ పరిస్థితుల వల్ల ఎప్పుడైనా ఎవరికైనా ఎలాంటి వ్యాధి అయినా రావచ్చు అనేది నగ్నసత్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వ్యవస్థ నెలకొల్పడంతో పాటు తరచుగా వైద్య పరీక్షలు చేసుకోవడం కూడా కీలకంగా మారిన నేపథ్యంలో ముఖ్యంగా క్యాన్సర్ సంబంధించి గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అనేవి మహిళల్లో ప్రధానంగా పెద్ద మొత్తంలో కనిపిస్తున్నవి. వాటిని గుర్తించి చికిత్సను ప్రారంభించే వరకు చాలా ఆలస్యం జరుగుతున్న కారణంగా అనేకమంది మృత్యువాత పడడాన్ని మనం గమనించవచ్చు. ముందు జాగ్రత్త పరీక్షల వల్ల నిర్ధారణ గనుక తొలినాళ్ళలో జరిగినట్లయితే దశా బ్దానికి పైగా కూడా బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆలస్యంగా గుర్తించడం వల్ల ఒకటి, రెండు,మూడు, నాలుగు దశలను దాటిపోయినట్లయితే ఇక భరించలేని పరిస్థితిలో వైద్యులు కూడా చేతులెత్తేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సమాజంలో చాలా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది మహిళలు కూడా ముందు జాగ్రత్త చర్యగా ఈ వైపు దృష్టి సారించి తమకు అనుమానాస్పదంగా ఉన్నటువంటి లక్షణాలను బేరిజు వేసుకొని మారుతున్న వాతావరణ కాలుష్యం జీవన శైలిలో వస్తున్నటువంటి ఆధునిక మార్పుల పేరుతో కనపడుతున్న వింత ధోరణిలో మార్కెట్లో దొరికేటువంటి ఆహార పదార్థాల వల్ల ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ ప్రధానంగా కనిపిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో తక్షణ పరిష్కారంగా ముందు జాగ్రత్త పరీక్షలు తప్ప మార్గాంతరం లేదు అని గ్రహించాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం శూన్యం దీనిని ఒక బాధ్యతగా కర్తవ్యం గా కుటుంబ సభ్యులు కూడా ఆలోచించినప్పుడు మాత్రమే సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో ముందు జాగ్రత్త పరీక్షలు చేయించుకోవడంలో మహిళలు విఫలమవుతున్నట్లు అనేక గణాంకాలు తెలియచేస్తున్నాయి ఇది చాలా బాధాకరం ఇంటికి ఇల్లాలు లేకపోతే ఆ కుటుంబమే నిర్జీవంగా మారిపోతుందనేది నగ్న సత్యం. రొమ్ము క్యాన్సర్ ఆలస్యమైతే ప్రాణాంతకమే తొలి నాళ్లలో గుర్తిస్తే మాత్రం ఛాలెంజ్గా బ్రతకడానికి అవకాశం ఉంటుంది అని కొంతమంది అనుభవజ్ఞుల ద్వారా తెలుస్తున్నది .
పరీక్షలు తప్పనిసరి. కొన్ని గణాంకాలు పరిశీలిస్తే
************
రొమ్ము క్యాన్సర్ వ్యాధి బారిన పడితే బ్రతకవచ్చు ప్రాణాంతకం కాదు అనే అభిప్రాయం ప్రజల్లో ఎక్కువగా ఉన్న కారణంగా పరీక్షలు చేయించుకోవడానికి అంత ముందుకు రావడం లేదు. మహిళా లోకం చైతన్యాన్ని పునికి పుచ్చుకోవడం కూడా లేదు ఇది చాలా విచారకరం. అందుబాటులో ఉన్న గణాంకాలు ఇండియాలో స్త్రీలు పురుషుల నివేదిక 2024 ప్రకారంగా ఒక్క 2022 సంవత్సరంలోనే రొమ్ము క్యాన్సర్ మూలంగా భారతదేశ వ్యాప్తంగా 98 వేల మందికి పైగా మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. భావజాల వ్యాప్తి కలిగించకుండా, అవగాహనను పెంచకుండా, చైతన్యాన్ని కలిగించకుండా రొమ్ము క్యాన్సర్ భారి నుండి మహిళలను కాపాడడం చాలా కష్టతరమైన నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖతోపాటు కళాశాలలు, విద్యాసంస్థలు, మహిళా సంఘాలు కూడా చైతన్యవంతమై మహిళల్లో ఈ అవగాహనను కల్పించవలసిన అవసరం చాలా ఉన్నది. తద్వారా లక్షలాది మందిని బ్రతికించుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు భారతదేశంలో బహు స్వల్పమని ఆ నివేదిక తెలపడం ఆందోళన కలిగించే విషయం భారతదేశంలో 30 నుండి 49 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష చేయించుకున్న మహిళల శాతాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది అది కేవలం 0.9%.
ఒక్కసారి వివిధ రాష్ట్రాలలో రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న వారి శాతాన్ని గమనిస్తే మానవ తప్పిదం ఏ మేరకు ఈ వ్యాధిని ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు
తమిళనాడులో 5.6%
మిజోరాంలో 2.7% ,కేరళ 2.4%
మణిపూర్ 1. 6% మహారాష్ట్ర 1.3%
ఆంధ్రప్రదేశ్ 0.8% ,మధ్యప్రదేశ్ 0.5%
కర్ణాటక, యుపి 0.4% ,
తెలంగాణ, బీహార్, ఢిల్లీ, హర్యానా 0.2%
అస్సాం చతిస్గడ్ ఒడిశా రాజస్థాన్ పచ్చబెంగాల్ 0.2%
గుజరాత్ ఝార్ఖండ్ 0.1%
పై గణాంకాలను గమనించినప్పుడు మారుతున్న కాలగమనంలో వ్యాధులు ముఖ్యంగా క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం కీలకమని ఆ నివేదిక తెలియచేస్తున్న విషయాన్ని ప్రభుత్వాలు పరిశీలించి పరీక్షలను చేయడం కర్తవ్యం గా భావించి ఏర్పాటు చేయాలి. అంతే స్థాయిలో మహిళల లోకం మహిళా సంఘాలు కూడా తమ బాధ్యతను గుర్తించినప్పుడు మాత్రమే ఈ వ్యాధిని అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది.