పట్టుదల ఉన్న వారిదే భవిష్యత్తు
ఆశయాలతో కూడిన కలలు కనడం దానికి పునాది కావాలి.* గతాన్ని తలచుకుంటూ ఉంటే చరిత్ర సృష్టించలేము.* చరిత్ర సృష్టించిన వారికి స్మారక చిహ్నలు అక్కర్లేదు అనేది బాబా ఆంటే వాదన. మన ఆలోచన ఏమిటి?*
************
--- వడ్డేపల్లి మల్లేశం 90142 06412
---19...01....2025*****----------ప్రణాళికబద్ధమైన జీవన విధానం, ఆరోగ్యకరమైన జీవనశైలి, సానుకూల దృక్పథం, భవిష్యత్తు పైన విశ్వాసం అదే సందర్భంలో లక్ష్యంతో కూడుకున్న ఆలోచన, మెరుగైన జీవన గమనం మనిషిని ముందుకు నడిపిస్తాయి. ఆలోచనలు ఆకాంక్షలు ప్రణాళికలు వ్యూహాలు ఏవి లేకుండా మొక్కుబడిగా బ్రతికే వాళ్ళు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు వాళ్లకు లక్ష్యం అంటూ లేకపోవడంతో చుక్కాని లేని నావల ఒడ్డుకు చేరే అవకాశం లేక చిందర వందర కు గురయ్యే ప్రమాదం ఉంటుంది మానవ జీవితం కూడా అంతే .మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముఖ్యంగా ఉపాధ్యాయ రంగంలో ఉన్నారు కనుక విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి సూచనచేస్తూ " కలలు కనండి ఆ కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేయండి. ఆ క్రమంలో వచ్చే అవాంతరాలు ఆటంకాలను అధిగమించడానికి వ్యూహాలను ప్రదర్శించి ముందుకు వెళ్లాలని" సూచించిన విషయం మనందరికీ తెలుసు. సానుకూల దృక్పథం సమన్వయంతో కూడుకున్నటువంటి ఆలోచన తప్పకుండా మనిషిని విజయపథం వైపు నెడుతుంది అనేది నగ్నసత్యం. భారతదేశ ప్రముఖ సామాజిక కార్యకర్త విశ్లేషకుడు పర్యావరణాన్ని ఆరాదిస్తూ కుష్టి వ్యాధిగ్రస్తుల పట్ల సానుకూల దృక్పధాన్ని ప్రదర్శిస్తూ వారి పునరుద్ధరణ కోసం ఆరోగ్యాన్ని పెంపొందించే క్రమంలో ఆరాటపడినటువంటి ప్రకృతి ప్రేమికుడు మహా మహారాష్ట్రకు చెందినటువంటి బాబా ఆంటే తన జీవితమంతా కుష్టు వ్యాధిగ్రస్తులకు కేటాయించిన తీరు మనందరికీ తెలుసు. అదే సందర్భంలో గొప్ప మానవతావాది కూడా అయిన ఆయన " కలలు కనడం ఆపితే అభివృద్ధి సాధించలేమని మనుషులు సాధారణమైన వ్యక్తులే అయినప్పటికీ అసాధారణమైన పట్టుదల కనుక ఉంటే సాధించే భవిష్యత్తు నాలుగు తరాలపాటు గుర్తుంచుకునే స్థాయిలో ఉంటుందని ఆ రకమైన గొప్ప పనులు చేసిన వాళ్లకు స్మారక చిహ్నలు అక్కరలేదని అదే సందర్భంలో గతాన్ని తలుచుకుంటూ ఉండేవారు ఎప్పుడు కూడా చరిత్రను సృష్టించలేరు చరిత్రను నిర్మించలేరు" అని చేసిన సూచన ప్రస్తుత సమాజానికి ఎంతో దోహదపడుతుంది అనడంలో సందేహం లేదు. నినాదం ఎవరిచ్చారు? సందేశం ఏమున్నది? నిత్య జీవితానికి ఉపయోగపడుతుందా? లేదా ఆ నినాదం ఇచ్చిన వాళ్లు పెద్ద హోదా కలిగిన వాళ్లేనా? అనే అంశం సందర్భచితం కాదు. మానవ జీవితాన్ని ఆకలింపు చేసుకునే క్రమంలో విజయపతాన్ని చేరుకోవడానికి, ఆ టంకాలను అధిగమించడానికి, శక్తిని కూడగట్టుకుని వ్యవస్థలో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరాన్ని నిక్కచ్చిగా నొక్కి చెప్పిన వాళ్లే చరిత్రలో మహనీయులుగా మిగిలిపోయినారు.
ప్రతి వ్యక్తి చరిత్ర సృష్టించాలి కానీ స్మారక చిహ్నల కోసం కాదు...
********
భారత మాజీ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా " చరిత్రను అధ్యయనం చేయడం అందరికీ తప్పనిసరి అదే సందర్భంలో తమకంటూ ఒక చరిత్రను సృష్టించుకునే క్రమంలో పనులు చేసి చూపాలి వ్యవస్థ మార్పుకు ఆ పనులు దోహదపడాలి ఎంత కష్టాన్ని అయినా భరించడానికి త్యాగాలకు సిద్ధపడాలి ఆ రకంగా కృషి చేసినప్పుడు మాత్రమే చరిత్రను సృష్టించడానికి అవకాశం ఉంటుంది చరిత్రలో నిలబడినటువంటి వేలాదిమంది ప్రముఖులు ఆ రకంగా కృషి చేసిన వాళ్లే "
అంటూ చేసిన సూచన కూడా ఇక్కడ మనకు దోహదపడుతుంది. అయితే చరిత్రను సృష్టించడం మాత్రమే గీటురాయి కాదు ప్రతి వ్యక్తి కూడా తన సామాజిక బాధ్యతను నిర్వర్తించే క్రమంలో తనకు ఉన్నటువంటి నైపుణ్యాలు ప్రతిభ క్రియాశీలత సృజనాత్మకతను బట్టి ఈ వ్యవస్థ కోసం ఆరాటపడవలసినటువంటి అవసరం ఉంటుంది ఈ అన్ని హంగులు ఉండి కూడా వ్యవస్థ కోసం ఆరాటపడకపోతే అతడు నిజంగా మనిషే కాదు అనేది అనేకమంది మేధావులు బుద్ధి జీవుల వాదన ప్రముఖ విప్లవ రచయిత శ్రీశ్రీ గారు కూడా ఒక సందర్భంలో ప్రస్తావిస్తూ కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అంటాడు అదే సందర్భంలో కొంతమంది వృద్ధులు పుట్టుకతో యువకులు అని కూడా వాళ్ల వాళ్ల యొక్క జాగ్యాలను ప్రవృత్తిని చైతన్యాన్ని నొక్కి చెప్పిన తీరు నేటి తరానికి రాబోయే తరాలకు కూడా పూర్తిగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది ఒక్క మాట చాలు లక్షలాది మందిని చైతన్యం చేయడానికి ఒక్క నినాదం సరిపోతుంది వ్యవస్థను మార్చడానికి అయితే సామాన్య ప్రధానికం జాగరుకులై ఉండాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినప్పుడు మాత్రమే అందుకే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి ఉండవలసిన లక్షణాలను ప్రస్తావిస్తూ ప్రజలు చైతన్యవంతులై జాగరుకులైనప్పుడు మాత్రమే రాజ్యాంగం విజయవంతంగా అమలవుతుందని ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని అదే ప్రజాస్వామ్యానికి కీలకమైన లక్షణమని చెప్పిన తీరు సందర్భోచితంగా పదులపరుచుకోవడం చాలా అవసరం
. పట్టుదల ఉన్న వారి ద్వారా దేశ భవిష్యత్తు సాధ్యం :-
**********)
మహారాష్ట్రలో 26 డిసెంబర్ 2014లో జన్మించినటువంటి మురళీధర్ దేవదాస్ అంటే బాబా అంటే గా ప్రసిద్ధులైనప్పటికీ ప్రకృతిని ప్రేమించడం పర్యావరణాన్ని ఆరాధించడంతోపాటు ముఖ్యంగా రోగుల పట్ల తన సానుభూతిని ప్రదర్శించడంతోపాటు తన జీవితమంతా వారి ఆరోగ్య పునరుద్ధరణ కోసం ప్రేమానురాగాలను పంచడం ద్వారా మానవతా వాదిగా చరిత్రలో నిలిచిపోయిన విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. సామాజిక కార్యకర్తగా విశ్లేషకునిగా గుర్తింపు తెచ్చుకున్న బాబా అంటే గాంధీ శాంతి బహుమతి, మహారాష్ట్ర భూషణ్ పురస్కారంతో పాటు జాతీయస్థాయిలో రెండవ పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకొని సామాన్యునిగా అసామాన్యమైన రీతిలో చేసిన కృషిని మనం ఈ సందర్భంగా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంటుంది. తన జీవితంలో ఆచరించినటువంటి విధానాన్ని ప్రజలకు దిశా నిర్దేశం చేయడంతో పాటు సమర్థవంతమైన భవిష్యత్తు ఈ దేశంలో సా కారం కావాలంటే కలలు కనడం ద్వారా అభివృద్ధిని సాధించాలని, కలలు కనకుండా అభివృద్ధి సాధించలేమని, అసాధారణ పట్టుదల ఉన్న వారిదే భవిష్యత్తు అవుతుందని హెచ్చరించిన తీరు మనందరికీ రేపటి భవిష్యత్తుకు కూడా నాంది అవుతుంది .చిన్నపాటి పని చేస్తే చాలు మనకు గుర్తి గుర్తింపు కావాలని, స్మారక చిహ్నలు ఉండాలని, విగ్రహాలు కావాలని కోరుకుంటున్నటువంటి ఈ దుర్మార్గమైన వ్యవస్థలో ఆయన నాలుగు తరాలు గుర్తుంచుకునే పని చేసిన వారికి కూడా స్మారక చిహ్నలు అక్కరలేదని గతాన్ని తలుచుకుంటూ మౌనంగా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం ద్వారా చరిత్రను సృష్టించవచ్చునని తన నిత్య జీవితంలో ఆచరించి చూపి మానవతావాదిగా చరిత్రలో ముద్ర పడినటువంటి బాబా ఆంటే గురించి మనం ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.అదే సందర్భంలో వారి వాదాన్ని, ఆలోచనను, ఆచరణను, కార్యశీలతను, సూచనలను కూడా పాటించడం ద్వారా కనీసం ఒక సాధారణ స్థాయిలో మనిషిగా నిలబడడానికైనా అవకాశం ఉంటుంది. ప్రతి పనికి తాత్కాలిక ప్రయోజనాలను స్వార్థాన్ని ఆశించడం సమాజం పట్ల విష ప్రచారాన్ని కొనసాగించడం మానుకొని మన మన స్థాయిలో ఏదైనా చరిత్రను సృష్టించడానికి మనకు ఉన్నటువంటి ప్రతిభ, సమర్థతను వినియోగించడం ద్వారా వ్యవస్థ యొక్క మేలు కోసం ఉన్నతమైన సమాజ నిర్మాణం కోసం అంతిమంగా సమసమాజ స్థాపన కోసం కృషి చేయవలసినటువంటి అవసరం చాలా ఉన్నది. ఆ రకమైన కృషి చేయడం ద్వారా మహనీయుల ఆలోచనలకు కొంతవరకైనా సార్థకత చేకూర్చితే అంతే చాలు. బాబా ఆంటే గారి ఆలోచనను పుక్కిట పెట్టుకుని, "సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్" అనే గాంధీ ఆలోచన మేరకు మన కృషిని కొనసాగించడమే మన ముందున్నటువంటి కర్తవ్యం. అదే వాస్తవంగా ఒక ఉన్నతమైనటువంటి సమాజ నిర్మాణానికి ప్రాతిపదిక కూడా .