రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
సీఎం రేవంత్ రెడ్డి పాలనకు పాలాభిషేకం: ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
సూర్యాపేట: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రం వాణిజ్య భవన్ సెంటర్ లో ఎవరు పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న ఆధ్వర్యంలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,లకు పాలభిషేకం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులను తీర్చుకుంటూనే ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులను వేగంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారని తెలిపారు. దాదాపు 68 లక్షల మంది రైతులకు రూ.7,500 కోట్లకు పైగా ఇప్పటికే జమ చేశారని, మిగిలిన నిధులను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇంత భారీ మొత్తాన్ని తక్కువ సమయంలో రైతుల ఖాతాల్లో జమ చేయడం దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పండిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు మేలు చేసిందని, రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.చివరగా, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని పిలుపునిస్తూ, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున పాలాభిషేక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి (వైయస్సార్) ది 77వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చకీలం రాజేశ్వరరావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరి కుంట్ల వేణుగోపాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి కక్కిరేణి శ్రీనివాస్, కౌన్సిలర్స్ కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, డాక్టర్ రామ్మూర్తి యాదవ్, కోడి నాగరాజు, సైదులు, కొనతం రాజేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాధి, అబ్దుల్ రహీం, పోలగాని బాలు గౌడ్, బండారు వెంకన్న, పాలగాని కృష్ణ, గుణగంటి సతీష్, కోడి శివ, పట్టణ మాజీ అధ్యక్షుడు బైరు వెంకన్న గౌడ్, నరేందర్ నాయుడు, చెంచాల నిఖిల్ నాయుడు, డిఆర్, తదితరులు పాల్గొన్నారు.