.రైతు వేదికలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకి అవగాహన సదస్సు
అడ్డగూడూరు 29 జులై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్ళరామారం గ్రామం రైతు వేదికలో రైతులకు మెట్టపంట అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ఈ సారి వర్షాలు సాధారణ వర్షపాతం కంటే తక్కువ ఉండే అవకాశం ఉన్నందున నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని మెట్ట పంటల సాగుకి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిచేయడం జరిగింది.అధిక నీటి అవసరం ఉన్న పంటల బదులు స్థానిక పరిస్థితులకి అవరమైన వర్షాధార పంటలను ఎంపిక చేసుకుంటే నష్టాలను తగ్గించవచ్చు.ఈసారి మండలం లో వర్షం సాధారణం కంటే తక్కువ ఉన్నందున వరి సాగు తగ్గించి మెత్త పంటలైన కందులు,సజ్జలుజొన్నలు,కూరగాయలు వంటి పంటలు వేసుకోవాలని తెలియజేయడం జరిగింది.చెరువులలో,బావులలో,బోరు బావులలో నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది.కావున వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉన్నందున రైతులు ఆలోచన చేసి పంటల సరళి మార్చాలని తెలిజేయడం జరిగింది. కార్యక్రమంలో స్ధానిక వ్యవసాయ అదికారి పి పాండురంగచారి చౌలరామారం స్థానిక సర్పంచ్ మందుల రేణుక కిరణ్ చిన్నపడిశాల సర్పంచ్ పూజారి సులోచన ఏఈఓలు అక్షర,రవి తేజ,పలు విత్తన డీలర్స్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.