రైతులందరు విధిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి

- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Feb 18, 2026 - 19:01
Feb 18, 2026 - 19:45
 0  0
రైతులందరు  విధిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి

సూర్యాపేట ఫిబ్రవరి 18:

రైతులందరు విధిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నంద్ లాల్ పవార్

 బుధవారం జరిగిన వీడియో (వెబ్ఎక్స్ )కాన్ఫరెన్స్ మీటింగులో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, రెవెన్యూ, మండల పరిషత్ మరియు సహకార సంఘం జిల్లా, మండల ,గ్రామ అధికారులు అందరూ హాజరు కావడం జరిగినది ఈ మీటింగ్ నందు ముఖ్యంగా AGRISTACK (తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ ) గురించి తెలుపుతూ, అందరూ అధికారులు త్వరితగతిన సూర్యాపేట జిల్లాలోని ప్రతి కుటుంబంలోని భూమి పట్టాపాస్ బుక్ కలిగి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ ( ఫార్మర్ ఐడి ) నమోదు చేసుకునేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించినైనది.

రైతు రిజిస్ట్రేషన్ (ఫార్మర్ ఐ.డి) ఎందుకు చేసుకోవాలి ?

కేంద్ర-రాష్ట్ర వ్యవసాయ పథకాల లబ్ధి సులభంగా పొందవచ్చు.

కేంద్ర ప్రభుత్వ పథకాల సహాయానికి ఫార్మర్ ఐడీ తప్పనిసరి.

రైతు వివరాలు ఖచ్చితంగా నమోదు అయి పారదర్శకత పెరుగుతుంది.

బీమా, సబ్సిడీలు, రుణాలు మరియు ప్రభుత్వ పధకాలు త్వరగా అందుతాయి.

ఒకే ఐడీతో లబ్ది నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తుంది.

భవిష్యత్ పథకాల ప్రయోజనాలు సులభం.

స్పష్టమైన గుర్తింపుతో మోసాలు తగ్గుతాయి.

రైతు రిజిస్ట్రేషన్ (ఫార్మర్ ఐ.డి) కు అవసరమైనపత్రాలు

ఆధార్ కార్డు నంబర్

భూమి పాస్బుక్ నంబర్

ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ తప్పనిసరిగా అవసరం.

 రైతు రిజిస్ట్రేషన్ (ఫార్మర్ ఐ.డి) ఎక్కడ చేపించుకోవాలి ?

ఇప్పుడు మీదగ్గర లోని అన్ని మీ-సేవ కేంద్రాల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించబడినది.

రైతు వేదికలోని వ్యవసాయ విస్తరణాధికారి (AEO) వద్ద నమోదు చేసుకోవచ్చు.

ఇట్టి రైతు రిజిస్ట్రీ నమోదు 100% పూర్తి చేయుటకు రేపటినుండి అనగా 19.02.26 నుండి 23.02.26 వరకు షెడ్యూల్ను ఇస్తూ మండలంలోని ప్రతి రెవెన్యూ గ్రామంలో ఒకరోజు వ్యవసాయ శాఖ మరియు ఇతర శాఖ అధికారులు అందుబాటులో ఉండి పూర్తిస్థాయిలో రైతు రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను చేస్తారు.

 అలాగే గ్రామంలో అందుబాటులో లేని రైతులు, వారు నివాసం ఉంటున్న ఇతర ప్రాంతాల్లోని ఏదైనా మీ సేవకు వెళ్లి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ను నమోదు చేసుకోవచ్చు.

 భవిష్యత్తులో అన్ని రాష్ట్ర కేంద్ర పథకాలు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి మీదనే ఆధారపడి ఇవ్వడం జరుగుతుంది అలాగే పంట రుణాలు, పత్తి కొనుగోలు, వరిపంట కొనుగోలు మరియు వ్యవసాయ శాఖ ఆధారిత పథకాలు అన్ని కూడా ఈ రైతు రిజిస్ట్రీ ఐడి ఆధారంగానే అమలు చేస్తారని రైతులందరూ గమనించగలరు.

 ఈ కాన్ఫరెన్స్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333