రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.

Mar 13, 2024 - 20:16
Mar 13, 2024 - 21:06
 0  60

 

ఆర్యవైశ్య సంఘం నాయకులు.

జోగులాంబ గద్వాల 13 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. ఆర్యవైశ్యులు ఎంతో కాలంగా  ఎదురు చూస్తున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ గురించి ఎన్నో ధర్నాలు ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. దీని ఫలితమే ఇప్పుడు మనకు లభించిందని ఆర్యవైశ్య నాయకులు అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రభుత్వం వచ్చిన100 రోజులు కాకముందే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆమోదించడం చాలా సంతోషకరమైన విషయమని అందుకు కృతజ్ఞత భావంతో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బుధవారం గద్వాలలోని పొట్టి శ్రీరాములు విగ్రహము దగ్గర పాలాభిషేకంతో వైశ్య సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు  మేడిశెట్టి బాలస్వామి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333