రెమా బైబిల్ కాలేజ్ నాగపూర్ ఇండియా లో డిప్లమా

గ్రాడ్యుయేషన్ పొందిన దుర్గం కరుణ శ్రీ ( హెప్సిబా ) ప్రభాకర్ నవంబర్ 30 శనివారం :బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ సతీమణి దుర్గం కరుణ శ్రీ ( హెప్సిబా ) రెమా బైబిల్ కాలేజ్ నాగపూర్ ఇండియా,క్యాంపస్ నందు ఫౌండర్ /ప్రెసిడెంట్ రెవ. యన్.వై. థోరట్ మరియు డా. సంజయ్ మరియు కాతి థోరట్, రెవ. కెన్నెత్ డబ్ల్యూ హెగేన్ - రేమా ప్రెసిడెంట్ యు. యస్. ఏ.ల ద్వారా సిస్టర్ దుర్గం కరుణ శ్రీ (హెప్సిబా ) ప్రభాకర్ బైబిల్ ఆధ్యాత్మిక డిప్లొమా గ్రాడ్యుయేషన్, పరిశుద్ధత్మ యొక్క మార్గదర్శకత్వం డిప్లమా థియ్యోలజి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ మరియు అభిషేకం పొందినారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ పొందటం ఎంతో సంతోషం గా ఉందని.దేవుని పరిచర్య కొరకు నన్ను పురికొల్పి 6 వ తరగతి చదివిన నన్ను నా భర్త 10 వ తరగతి మరియు ఇంటర్ మీడియట్ చదివించి,ఇప్పుడు నాగార్జున విశ్వావిద్యాలయం గుంటూరు, దూర విద్యా కేంద్రం లో బి. ఏ. చదివిస్తూ, ఏమి రాని నన్ను ఇంగ్లీష్ మిడియంలో బైబిల్ కోర్స్ చదవటానికి ప్రోత్సహ పరిచిన నా భర్త గురించి ఎంత చెప్పిన తక్కువే అనీ అన్నారు.ఆలాగే నా కొరకు ప్రార్ధన చేసిన సంఘ బిడ్డలందరికి ప్రభు పేరట వందనాలు తెలుపుతూ,నేను బేతెస్థ మినిస్ట్రీస్ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తానని అన్నారు