రెండు వాహనాలు(డి)ఒకరు మృతి

Jul 11, 2026 - 00:00
Jul 11, 2026 - 00:01
 0  1

అడ్డగూడూరు 10 జులై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కంచనపల్లి గ్రామానికి చెందిన బెల్లి వెంకటేశ్వర్లు (వయసు 40 సంవత్సరాలు)టిఎస్-30-బీ-0016 మోటార్ సైకిల్ పై పాటిమట్ల ఎక్స్ రోడ్డు నుండి కంచనపల్లికి గ్రామానికి వెళుతుండగా కమ్మగూడెం సమీపంలో ఎదురుగా తిరుమలగిరి నుండి వలిగొండ వైపు వెళ్లే మహేంద్ర వాహనం టిజి-30-B-3052 గల వెహికల్ ఎదురుగా బలంగా ఢీకొట్టడం వల్ల తలకు తీవ్ర గాయమై భువనగిరి ఏరియా హాస్పిటల్ కి తరలించగా మార్గమధ్యలో మరణించడం జరిగిందని అన్నారు.పోలీసులు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.అదేవిధంగా నిందితున్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.