రాష్ట్ర బడ్జెట్లో బిసిలకు అన్యాయం CPI జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు.

జోగులంబ గద్వాల 19 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం సిపిఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి బట్టి విక్రమార్క 3,04,965 కోట్లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో బిసిలకు కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగింది. కొన్ని రంగాలకు సరైన కేటాయింపులు జరిగిన, ఎస్సీ, ఎస్టీ ల కన్న అధికంగా జనాభా ఉన్న బిసిలకు కేవలం 11వేల కోట్లు ఇవ్వడం ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. రాష్ట్రంలో ఇంకా మిగిలి ఉన్న రైతు రుణమాఫీ 2లక్షల పైనున్న మాఫీకి బడ్జెట్లో ఉసేలేదు.యూత్ పాలసి నిరుద్యోగ భృతికై బడ్జెట్లో కేటాయింపులు లేవు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుకు నిధులు కేటాయింపులు లేవు.గట్టు ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించలేదు , ర్యాలంపాడు ప్రాజెక్టు మరమ్మతులకు నిధుల ప్రస్తావన లేదు, ప్రభుత్వం ఎంత జాగ్రత్తలు తీసుకొని బడ్జెట్ ప్రవేశ పెట్టినా కొన్ని రంగాలకు సరైన న్యాయం చేయలేకపోయారు.
బి ఆంజనేయులు
సిపిఐ జిల్లా కార్యదర్శి
జోగులాంబ గద్వాల