రాత్రి నుంచి రెండు రోజులపాటు మీ సేవలు బంద్..!

Apr 4, 2026 - 06:52
 0  3
రాత్రి నుంచి రెండు రోజులపాటు మీ సేవలు బంద్..!

తెలంగాణ రాష్ట్రంలోని శుక్రవారం రాత్రి నుంచి రెండు రోజుల పాటు మీ సేవలు బంద్..!

అడ్డగూడూరు 03 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– తెలంగాణలో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో శుక్రవారం రాత్రి నుంచి అన్ని సేవలు నిలిచిపోనున్నాయి. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కోసం ఈ తాత్కాలిక అంతరాయం ఏర్పడుతుందని మీసేవ నిర్వాహకులు తెలిపారు.కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కావడానికి 36 గంటల సమయం పట్టనుంది. శనివారం నుండి ఆదివారం సెలవులు కావడంతో,మీసేవలు సోమవారం ఉదయం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని నిర్వాహకులు ప్రజలకు సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333