రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ
తిరుమలగిరి 11 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తెలంగాణ తొలి భూపోరాటంలో పేదల పక్షాన నిలిచి, భూస్వాములు, పెత్తందారులు, రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు తిరుమలగిరి మండల రజక సంఘం మండల అధ్యక్షుడు పులుమామిడి సోమన్న ఆధ్వర్యంలో ఘనంగా వీర నారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి నిర్వహించారు ఈ సందర్భంగా. తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకపల్లి రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ నిజాం పాలనలో భూస్వాములు, పెత్తందారుల దోపిడీ, అణచివేతకు గురవుతున్న పేద ప్రజల పక్షాన ఐలమ్మ ధైర్యంగా నిలిచారని కొనియాడారు. దొరలు, రజాకార్ల ఆగడాలను ఎదిరించి బడుగు, బలహీన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆమె సాగించిన పోరాటం చారిత్రాత్మకమన్నారు. ఐలమ్మ పోరాటం ఒక వర్గానికే పరిమితమైనది కాదని, అణగారిన వర్గాల హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం సాగిన ఉద్యమానికి ప్రతీక అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ గోవిందమ్మ రవీందర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు ఎల్సోజు నరేష్ మాజీ ఎంపీపీ కొత్తగట్టు మల్లయ్య మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ ఎమ్మార్పీఎస్ నాయకులు కందుకూరి సోమన్న బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కందుకూరి ప్రవీణ్ సిపిఐ నాయకులు కడెం లింగయ్య బిజెపి నాయకులు మేడబోయిన యాదగిరి పూసల శ్రీను తిరుమలగిరి రజక సంఘం నాయకులు మల్లయ్య నర్సయ్య బిక్షం వీరయ్య పరశురాములు నాగరాజు ఎల్లయ్య నరేష్ రాము అలాగే అన్ని కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు...