యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి.
- సమాజానికి, ప్రజలకు సేవ చేసే వనరుగా యువత ఎదగాలి....... సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్.
ప్రతిష్ట ఫార్మసీ కళాశాలలో విద్యార్థులకు ‘డ్రగ్స్ నిర్మూలన’పై విస్తృత అవగాహన
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కార్యక్రమం
డ్రగ్స్, గంజాయి నిర్మూలనలో తమ వంతు భాగస్వాములం అవుతాము, గంజాయి అలవాటు ఉన్నవారిలో పరివర్తన తెస్తాం అని విద్యార్థులు ప్రతిజ్ఞ.
> గంజాయి, మాదకద్రవ్యాల పై సమాచారం నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి, యువత కస్టపడి చదువుకోవాలి, ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అని ఎస్పీ నరసింహ పిలుపునిచ్చారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చివ్వెంల మండల పరిధిలోని దురాజుపల్లి గ్రామ సమీపంలో గల ప్రతిష్ట ఫార్మసీ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలన పట్ల విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ నరసింహ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ మన సమాజం నుండి డ్రగ్స్ తరిమివేసి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది, దీనికోసం సంబంధిత ప్రభుత్వ అధికారులు, జిల్లా పోలీస్, జిల్లా యంత్రాంగం అనుక్షణం పని చేస్తుంది అన్నారు.
యువత, విద్యార్థులు ఉన్నత లక్ష్యాల వైపు సాధన చేయాల్సి అన్నారు, కష్టపడే వయస్సులో వ్యసనాలకు అలవాటు పడొద్దు, చెడుకు దూరంగా ఉండాలి, మంచి స్నేహితులను, మంచి పుస్తకాలను ఎంచుకోవాలి, తల్లిదండులకు, చదువు నేర్పు గురువులకు మంచి పేరు తేవాలి, సమాజానికి, ప్రజలకు మంచి సేవ చేసే వనరుగా ఎదగాలి అని అన్నారు. మహిళలు, బాలలు, విద్యార్థుల రక్షణలో అనుక్షణం పని చేస్తున్నాము అన్నారు.
ప్రస్తుతం మన సమాజాన్ని, ముఖ్యంగా దేశానికి వెన్నుముక లాంటి యువతను డ్రగ్స్ మహమ్మారి పట్టిపీడిస్తోందని అన్నారు. మాదకద్రవ్యాల వల్ల భావితరాలు తమ ఉజ్వల భవిష్యత్తును చేతులారా కోల్పోతున్నాయని హెచ్చరించారు. డ్రగ్స్‌కు బానిసలైన యువత తీవ్ర అనారోగ్యాల బారిన పడటమే కాకుండా, కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని పేర్కొన్నారు. "దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. అలాంటి యువశక్తి డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాలకు బానిసలైతే దేశ ప్రగతి కుంటుపడుతుంది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్క విద్యార్థి, పౌరుడు భాగస్వాములు కావాలి అన్నారు. జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి విక్రయాలు జరుగుతున్నా, వాటి మూలాలు ఉన్నా వెంటనే పోలీసు వారికి సమాచారం అందించి సహకరించాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. గంజాయి లేదా ఇతర వ్యసనాలకు బానిసలైన వారు ఎవరైనా ఉంటే, వారిని గుర్తించి సంరక్షణ (పునరావాస) కేంద్రాలకు తరలించి వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అందరూ కృషి చేయాలి అన్నారు. జిల్లా పోలీస్ శాఖ డ్రగ్స్ నిర్మూలనకు అనుక్షణం పనిచేస్తోంది. నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ, గంజాయి సంబంధిత కేసుల్లో ఉన్న పాత నేరస్థులపై నిఘా ఉంచి, వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాము అన్నారు. డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపడంలో యువతరం ముందుండాలని, సమాజ మార్పు కోసం పోలీసులతో చేతులు కలపాలని ఎస్పీ పిలుపునిచ్చారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనలో తమ వంతు భాగస్వాములం అవుతాము, గంజాయి అలవాటు ఉన్నవారిలో పరివర్తన తెస్తాం అని విద్యార్థులు ప్రతిజ్ఞ చేయించడం జరిగినది.
ఈ సమాజంలో మరో తీవ్ర అంశాలు రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాలు అన్నారు. వీటిని అరికట్టాలంటే ప్రజలు అవగాహన, ముందు చూపు, జాగ్రత్తలు ప్రదానం అన్నారు. జీవితంలో ఎదిగి కుటుంబాలకు తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన వారు అజాగ్రత్తగా వాహనాలు నడుపు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ముందస్తు జాగ్రతలు పాటించాలి అని కోరారు. అత్యాశకు పోయి అపరిచితులకు మన వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చినట్లయితే మోసాలకు గురి అవుతామని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు ఫోన్లకు వచ్చే మెసేజ్లను స్పందించి అపరిచితులకు ఎవరు డబ్బులు చెల్లించవద్దు అని కోరారు. బహుమతులు ఉన్నాయి తక్కువ తక్కువ వడ్డీలకు లోన్స్ ఇస్తాము ప్రభుత్వ పథకాలు ఇస్తాము ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి అంటే అలాంటి సమాచారాన్ని నమీ ఎవరు కూడా అపరిచితులకు డబ్బులు పంపకూడదు అన్నారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్, చివ్వెంల ఎస్ఐ మహేష్, కనకరాత్నం, బరోసా ఎస్ఐ మౌనిక, షీ టీం ఎస్సై నీలిమ, పోలీసు సిబ్బంది కళాశాల యాజమాన్యం డా. రామకృష్ణ, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు మరియు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.