యువకుడి మృతదేహం లభ్యం

వలిగొండ 19 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెలువర్తి బ్రాహ్మణ చెరువు అలుగు పోయడంతో మోత్కూర్ మండలం పాలడుగు గ్రామానికి చెందిన పదిమంది యువకులు కలిసి చాపల వేటకు వెళ్లారు దీంతో అదే గ్రామానికి చెందిన శివరాత్రి నవీన్ (25) అనే యువకుడు సాయంత్రం గల్లంతయ్యాడు అప్రమత్తమైన యువకులు స్థానికులు కలిసి నీటిలో యువకుడి కోసం గాలింపు చర్యలకు పాల్పడినారు ఎంతకు దొరకకపోవడంతో రాత్రి సమయంలో రంగంలోకి దిగిన పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఎన్టీఆర్ ఎఫ్ బృందం సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టగా ఘటన స్థలం నుంచి కిలోమీటర్ దూరంలో వెలువర్తి లోతుకుంట మధ్య వాగులో మృతి దేహం లభించింది స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు...