మోటర్లు వాడకంతో నీటి కటకట.
జోగులాంబ గద్వాల 2 జూలై 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల మండలం పరిధిలోని వివిధ గ్రామాల లో తాగు నీటిని విడుదల చేసే సమయంలో విద్యుత్ మోటార్లను వినియోగించడంతో నీళ్లు సరిగ్గా రావడం లేదని మండలం లోని వివిధ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఫలితంగా తాగునీరు కరువైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిని విడుదల చేసే సమయంలో విద్యుత్ సేవలను నిలిపివేస్తే నీటి కొరత ఉండదని అధికారులు ఆ వైపు దృష్టి సారించాలని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండలంలోని అన్ని గ్రామాలకు అన్ని కాలనీలకు నీళ్లు వచ్చే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.