మొహరం పండుగ వేడుకల్లో పాల్గొన్న జూపల్లి అనుచరులు
7-07-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
త్యాగానికి ప్రతి కారం మొహరం పండుగ వేడుకల్లో పాల్గొన్న జూపల్లి అనుచరులు.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో మొహర్రం పండుగ సందర్భంగా ఇమాన్ కాసిం, హుస్సేన్ భాష,, బండలయ్య, మౌలాలి, అల్ అక్బర్ పీర్ల ను దర్శించుకున్న గూడెం గ్రామ జూపల్లి అనుచరులు.
గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని పీర్లకు దట్టీలు సమర్పించి, టెంకాయలు కొడుతూ మొక్కులు చెల్లించుకుంటున్నారు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు, హిందువులు కలిసి మెలిసి సోదర భావంతో నిర్వహించే పండుగనేేే మొహరం. మొహరం పండుగను ఘనంగా నిర్వహించుకునే పండగ పీర్ల పండుగ నిర్వహించు కొని గ్రామాలలో పేర్లు ఊరేగింపు లో ప్రజలందరూ ప్రజల మధ్య ఐక్యతను, సఖ్యతను గంగా జమునా తేహబీబ్ ను అని తెలిపారు.
అల్లా ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం గూడెం గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలు జీవించాలని మనస్ఫూర్తిగా ఆ అల్లాను కోరుకోవడం జరిగినది.
మొహరం చివరిరోజైనా వేడుకల్లో గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు, పిల్లలు పెద్దలు, ముస్లిమ్స్ కులమత బేధం లేకుండా ఆటపాటలతో ఊరేగింపులో పాల్గొని పీర్లు వెళ్తుంటే చివరి దాకా ఉండి పీర్లను బాయికి సాగనంపారు.
ఈ కార్యక్రమంలో జూపల్లి అనుచరులు క్యాథూరి రాముడు, కుమ్మరి బుచ్చన్న, నీరు కట్టి నరసింహ, అల్లం నారాయణ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, పెద్దలు పిల్లలుపెద్ద ఎత్తున పాల్గొని మొహరం వేడుకల్లో పాల్గొన్నారు.