మృతురాలు పూజాకు శ్రద్ధాంజలి

Feb 23, 2026 - 13:54
Feb 23, 2026 - 19:10
 0  14
మృతురాలు పూజాకు శ్రద్ధాంజలి

*మృతురాలు పూజాకు శ్రద్ధాంజలి*

 ఏటూరునాగారం తెలంగాణ వార్త :- ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క ఆదేశాలమేరకు,ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ఏటూరునాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న సూచనలమేరకు ఏటూర్ నాగారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చిటమట రఘు ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండల కేంద్రంలోనీ మానసపల్లి గ్రామానికి చెందిన జెగజంపుల పూజ వివాహిత మహిళ గుండెపోటు రావడంతో ఆదివారం మృతి చెందడం తో మరణించిన పూజ పార్ధివదేహాని కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.పూజా మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారని, ఈ కఠిన సమయంలో పార్టీ తరఫున పూర్తి అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు చిటమట రఘు,గంపల శివ,పడిదల హనుమంతు, నెగరకంటి ముతేష్,పాగా నాగరాజు కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు._

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్