మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు బందోబస్తు కు 350 మంది పోలీస్.
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 163 BNSS నిషేద ఆజ్ఞలు అమలు. (144 సెక్షన్ అమలు).
విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేదం
కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా 350 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు అన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల వద్ద నిషిద్ధ ఆజ్ఞలు అమలులో ఉంటాయి అన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రత నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 163 BNSS (144 సెక్షన్ అమలు) అమలు చేస్తున్నామని అన్నారు. ఈ యొక్క 163 BNSS సెక్షన్ రేపు ఉదయం 6 గంటల నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపునకు హాజరు అయ్యే అభ్యర్థులు, ఏజెంట్లు, నిషేధిత వస్తువుల అయిన అగ్గిపెట్టెలు, లైటర్,ఇంక్ బాటల్స్, పేలుడుకు కారణం అయ్యే ఎలాంటి వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకురాకూడదని తెలిపారు మరియు తనిఖీలు చేసే సిబ్బందికి సహకరించాలని కోరారు. ఎలక్షన్ కమిషన్ ద్వారా జారీ చేయబడిన గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతి ఉంటుంది అన్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చడం వంటి చర్యలకు అనుమతి లేదని అన్నారు. గెలిచిన అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లెక్కింపు కేంద్రాల వద్ద శాంతిభద్రతలు కాపాడేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక బందోబస్తు, క్యూఆర్టి టీములు, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీములు, స్ట్రైకింగ్ ఫోర్సులు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
ముఖ్య సూచనలు:
- ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి.
- ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు పూర్తిగా నిషేధం.
- శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు చేయరాదు.
- నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపించబడతారు.
- ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించాలంటే సంబంధిత అధికారుల అనుమతితో నిర్దేశించిన తేదీల్లో మాత్రమే నిర్వహించాలి.
- ప్రజలందరూ శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడుతూ ఫలితాలను పరస్పర గౌరవంతో స్వీకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.