మున్సిపల్ అభివృద్ధే మా లక్ష్యం
సూర్యాపేట, 25 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వార్డును సమగ్రంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 5వ వార్డు దురాజ్‌పల్లిలో రూ.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న మురికి కాలువ నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మున్సిపాలిటీ కట్టుబడి ఉందన్నారు. డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వార్డుల వారీగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ధరావత్ విజయ సక్రు నాయక్, కాంగ్రెస్ నాయకులు మద్దేబోయిన శ్రీనివాస్, మద్దేబోయిన తిరుమలేష్, నబి ఖాన్, కొత్తపల్లి వెంకన్న, మున్సిపల్ డి ఈ ప్రణయ్ రెడ్డి, వార్డు ఆఫీసర్ మహేష్, కాంట్రాక్టర్ ఇమ్రాన్ ఖాన్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.