చిత్తడి నేలల సంరక్షణ నోటిఫికేషన్‌ పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Sep 7, 2026 - 22:48
 0  1
చిత్తడి నేలల సంరక్షణ నోటిఫికేషన్‌ పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

జిల్లా చిత్తడి నేలల కమిటీ అధికారులతో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అద్యక్షతన  సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రతి చిత్తడి నేల యొక్క క్షేత్రస్థాయి పరిశీలన (గ్రౌండ్ ట్రూతింగ్) మరియు సరిహద్దుల నిర్ధారణను పూర్తి చేయాలని సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను అనుసరించి చిత్తడి నేలల నోటిఫికేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి మరియు వేగవంతం చేయడానికి, జిల్లా కలెక్టర్‌ను చైర్‌పర్సన్‌గా, డిఎఫ్‌ఓను సభ్య కార్యదర్శిగా మరియు సంబంధిత శాఖల అధికారులను సభ్యులుగా నియమించి, జిల్లా చిత్తడి నేలల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగిందని పిసిసిఎఫ్(హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) తెలియజేశారు. శాటిలైట్ చిత్రాల నుండి పొందిన చిత్తడి నేలల సరిహద్దుల క్షేత్రస్థాయి ధృవీకరణ మరియు నిర్ధారణ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి మరియు వేగవంతం చేయడానికి, సంక్షిప్త పత్రం తయారీకి మరియు నోటిఫికేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనల సమర్పణకు జిల్లా స్థాయి చిత్తడి నేలల కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిదంగా జిల్లా కలక్టర్ కమిటీ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలోని 302 చిత్తడి నేల యొక్క క్షేత్రస్థాయి పరిశీలన (గ్రౌండ్ ట్రూతింగ్) మరియు సరిహద్దుల నిర్ధారణను సంబధిత శాఖల సమన్వయంతో పూర్తి చేయాలని కమిటీ అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ చిత్తడి నేలలు ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా చూడాలని, పులిచింతల రిజర్వాయర్ మరియు మూసి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ల చిత్తడి నేలలను కూడా నోటిఫై చేయాలనీ  అధికారులను కలెక్టర్ ఆదేశించడం జరిగింది. ఈ సమావేశం లో కమిటీ సభ్యులు అడిషనల్ కలెక్టర్ బి హరిసింగ్, డిఆర్ఓ ప్రేమ్ రాజ్, జిల్లా అటవీ అధికారి దామోదర్ రెడ్డి, డి ఏ ఓ శ్రీధర్ రెడ్డి, డి ఆర్ డి ఓ పి డి సన్యాసయ్య, ఆర్ డి ఓ లు వేణుమాధవ్, శ్రీనివాసులు, సూర్యనారాయణ, జిల్లా ఇరిగేషన్ అధికారులు, జిల్లా అధికారులు  పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333