ముజ్జిగూడెం రైతు వేదిక లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ""వ్యవసాయం మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి : నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలోని రైతు వేదిక లో జరిగిన కార్యక్రమంలో ముజ్జుగూడెం, అనాసాగారం గ్రామాలకు చెందిన అర్హులైన వారికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్లపట్టాలను రెవెన్యూ గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సూచన మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం లో పేద ప్రజల సొంతింటి కల నెరవేరుతుందన్నారు. ప్రజా ప్రభుత్వం లో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని ఆయన చెప్పారు. మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాలేరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందించే పథకాలు అందుతాయని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శాఖమూరి రమేష్,కాంగ్రెస్ జిల్లా నాయకులు కొడాలి గోవిందరావు,నేలకొండపల్లి తహశీల్దార్ వెంకటేశ్వర్లు, MPDO ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు*