ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
రాష్ట్ర చరిత్ర లోనే ప్రప్రథమం, లక్షల మందికి ఉద్యోగులకు మేలు.
హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు.
తిరుమలగిరి 04 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్;- ప్రభుత్వ జూనియర్ కళాశాల తిరుమలగిరిలో పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్లు ఈ నెల 1వ తారీకునే జీతాలు రావడం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేసారు. తెలంగాణ రాష్ట్ర చరిత్ర లోనే మొదటిసారిగా రాష్ట్రం లో అన్ని శాఖ తాత్కాలిక ఉద్యోగులకు కూడా నెలలో మొదటి రోజునే వేతనాలు అందివ్వడం ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం అని కొనియాడారు, గత 11 సంవత్సరాలలో తొలిసారిగా వేతనాలు మొదటి రోజునే అందటంతో తాత్కాలిక ఉద్యోగులు హర్షం వ్యక్తం చేసారు. ఈ చారిత్రత్మక నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉన్న ఎన్నో లక్షల మంది కాంట్రాక్టు, గెస్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని తాను ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ఒకటో తేదీన జీతాలు వేయించడం పట్ల గర్విస్తున్నామని లెక్చరర్స్ తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపల్ బాల్తా శ్రీనివాస్ అధ్యాపకులు జిల్లా నాయకులు శనగల శ్రీధర్,కట్ట దయాకర్ నవీన్ రంగా పవన్ చంద్రశేఖర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.