ముందు తరాల కోసం చెట్లను నాటాలి మున్సిపల్ చైర్మన్
తిరుమలగిరి 04 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:-
వన మహోత్సవం సందర్భంగా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని కూరగాయల సంతలో మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ చెట్లే మనకు ఊపిరి, చెట్లుంటేనే వర్షాలు, చల్లదనం అని, మన తర్వాతి తరాల కోసం మొక్కలు నాటాలని వారు సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని వారు కోరారు.. ఈ కార్యక్రమంలో... మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఎల్సోజు గోవిందమ్మ ,కమిషనర్ సిహెచ్ వెంకన్న, ఎస్సై వెంకట్ రెడ్డి వార్డ్ కౌన్సిలర్స్ పనికరా లక్ష్మి , జక్కుల రమేష్ ,కారుపోతుల సోమలక్ష్మి నరేష్ , బత్తుల శ్రీను , కందుకూరి గీత బాబు , సంకేపల్లి జ్యోతి నరోత్తం , పత్తేపురం త్రిశూల్ , కో ఆప్షన్ మెంబెర్స్ మోడేపు పద్మ ,ఎండి జాకియా , దేశీయ నాయక్ , ప్రజా ప్రతినిధులు మున్సిపల్ స్టాఫ్ మెప్మా ఆర్ పి లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.