మారోజు వీరన్న వర్ధంతి సభను జయప్రదం చేయండి

May 26, 2024 - 19:12
May 26, 2024 - 19:26
 0  6
మారోజు వీరన్న వర్ధంతి సభను జయప్రదం చేయండి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్  మారోజు వీరన్న వర్ధంతి సభను జయప్రదం చేయండి* ఈనెల 31న ఆత్మకూరు మండలం ముక్కుడుదేవులపల్లి గ్రామంలో కులవర్గ పోరాట సిద్ధాంతకర్త కామ్రేడ్ మారోజు వీరన్న 25వ వర్ధంతి సభను ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ రెవల్యూషన్ ఆఫ్ మా "రోజు" ఆధ్వర్యంలో జరుగు సభను జయప్రదం చేయాలని ఆదివారం నాడు శుభం ఫంక్షన్ హాల్ దగ్గర కరపత్రం ఆవిష్కరించారు. ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చామకూర నర్సయ్య మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ మన భారత దేశంలో ఉన్నది అని గుర్తించి, మూడు దశాబ్దాల క్రితమే మనకు కామ్రేడ్ మారోజు వీరన్న కుల వర్గ సిద్ధాంతాన్ని అందించారు ఆనాడు వీరన్న కుల సంఘాలను ఏర్పాటు చేస్తూ బహుజన శ్రామిక వర్గ రాజ్య స్థాపన జరగాలని ప్రజలను చైతన్యం చేస్తూ అనేక ఉద్యమాలను ముందుకు తీసుకొచ్చారని వీరన్న చేస్తున్న ఉద్యమాలను చూసి పాలక పార్టీల పీఠాలు కదులుతాయని గుర్తించి కామ్రేడ్ మారోజు వీరన్న ను ఆటోలో వెళుతున్న వీరన్న తీసుకువెళ్లి మే 16న రాజ్యం ఎన్కౌంటర్ చేసిందని కొనియాడారు వీరన్న భౌతికంగా మన మధ్యలో లేకపోయినా వీరన్న అందించినటువంటి సిద్ధాంతం ఆలోచనలు నేటితరం ముందుకు తీసుకు వెళ్ళవలసిన బాధ్యత నేటి తరానికి ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో దడిపల్లి వెంకట్, గుండు వెంకన్న, బుక్కరాజు తిరుపతి, నల్లడ మాధవరెడ్డి, గుండాల సందీప్, దుర్గం సైదులు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.